వారి కుటుంబలని పారమర్శించటానికి వెళ్లిన వైసీపీ దళిత నేతలు
వాళ్ళని వెనక్కి పొమ్మని నెట్టేసిన గోపాలపురం దళితులు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
మండలంలో గోపాలపురం లో తినేసి పడవేసే డిస్పాజబుల్ ప్లేట్లు పై భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటం ముద్రించిన ఘటనలో ప్రశ్నించిన దళిత యువకులపై అక్రమ కేసులు కట్టి రాజమహేంద్రవరం కేంద్రకారగారం పాలైన బాధితకుంటుంబాలను పరామర్శించేందుకు ఎట్టకేలకు వెళ్లిన వైసిపి నాయకులకు చేదు అనుభవం ఎదురైంది.మంగళవారం గోపాలపురం గ్రామంలో భాదిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన వైసిపి నేతలకు ఘోరపరాభవం జరిగింది.గ్రామంలో సంఘటన జరిగి రోజులు గడిచి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చామా అంటూ నాయకులు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అక్రమంగా కేసులు కట్టించిందే మీనాయకుడు అలాంటిది ఏమొహం పెట్టుకొనివచ్చారంటూ మహిళలు నాయకులు నిలదీసారు. దూరప్రాంతాలకు చెందిన వివిద పార్టీలకు చెందిన దళితేతర నాయకులు,రాష్ట్ర స్థాయి దళిత నాయకులు,ఉద్యమ నాయకులు సుదూర ప్రాంతాలనుండి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా మేముంటామని భరోసా కల్పించి వెళ్తుంటే ఇన్నాళ్లకు గుర్తొచామా అని బుజాలు తట్టి మరీ వెనుకకు పంపించారు.చేసేదేమి లేక వైసిపి నేతలు వెనుదిరిగారు.