విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:
రామచంద్రపురం (విశ్వం వాయిస్ ప్రతినిధి )
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మండల పరిధిలో ఉన్న భీమ క్రోసు పాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సినిమా ఆటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్కూల్లో ఉన్న తరగతి గదులను , మరుగుదొడ్లు పరిశీలించి స్కూల్ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మధ్యాహ్నం భోజనం పథకంలో అందించే భోజనం రుచికరముగా అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఏమైనా సమస్య ఉంటే చెప్పవలసిందిగా విద్యార్థులని కోరారు. స్కూలుకు ఏమైనా సమస్యలున్న ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు మంత్రివర్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.