డయాబెటిక్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి
రెగ్యులర్ వాకింగ్ చేయాలి
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి
రెగ్యులర్ వాకింగ్ చేయాలి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి :
డాక్టర్ డివి సత్యం
అంబాజీపేట ( విశ్వం వాయిస్ ప్రతినిధి )
అంబాజీపేటలో నూతనంగా ప్రారంభించబడిన ఉష డయాబెటిక్ జనరల్ కేర్ క్లినిక్ సర్వీసులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ డివి సత్యం అన్నారు . గురువారం బస్టాండ్ రోడ్డు , షరీఫ్ కాంప్లెక్స్ , పతాంజలి షాపు ప్రక్కన గురువారం ప్రారంభించారు . ఈసందర్భంగా షుగర్ వ్యాధి నిపుణులు , జనరల్ సర్జన్ డాక్టర్ డివి సత్యం మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుత నేటి ఆధునిక తరంలో జంక్ ఫుడ్ , ఫాస్ట్ ఫుడ్డులకు దూరంగా ఉండాలని అన్నారు . ప్రతి ఒక్కరు డయాబెటిక్ , బిపి పట్ల అవగాహన కలిగి ఉండాలని నిత్యం వాకింగ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండటం వల్ల షుగర్ వ్యాధిని , బీపీని అదుపులో ఉంచుకోవచ్చు అని అన్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో షుగర్ పరీక్షలు , బిపి పరీక్షలు జనరల్ చెకప్ చేయించుకొని మందులు వాడాలని అన్నారు . జనరల్ కేర్ క్లినిక్ వాసంశెట్టి రేణుక ఆధ్వర్యంలో , లాప్రోస్కపీ జనరల్ సర్జన్ డాక్టర్ ఎం ఫణి కుమార్ క్లినిక్ లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని డాక్టర్ డివి సత్యం పేర్కొన్నారు. ఈనెల 31 వ తారీకు వరకు ఓపి ఉచితంగా చూస్తారని అన్నారు. ల్యాబ్ లో 20% డిస్కౌంట్ అలాగే షుగర్ బిపి పరీక్షలు ఉచితంగా చేస్తారని అన్నారు. మందులపై ప్రత్యేక డిస్కౌంటు ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్ అంకం నాగమల్లేశ్వరరావు , పుల్లేటికురు సర్పంచ్ జల్లి బాలరాజు, మండల తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు , నాగబత్తుల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నాగాబత్తుల వెంకట సుబ్బారావు , మాచవరం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ సుంకర పేరయ్య నాయుడు, ఎన్ కృష్ణ ప్రసాద్ ( లాస్య ల్యాబ్ ) పలువురు డాక్టర్లు , తదితరులు పాల్గొన్నారు.