విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం రూరల్:
స్థానిక రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియపుసావరం గ్రామంలో సోమవారం నాడు సచివాలయం-2 పరిథిలో మొదటి రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ కో ఆర్డనేటర్ చందన నాగేశ్వర్.రాష్ట్రంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి,సంక్షేమం ధ్యేయంగా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని చందన నాగేశ్వర్ పేర్కొన్నారు.ముందుగా సచివాలయ సిబ్బందితో సమావేశమై నాడు జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వొచ్చిన పిర్యాదులు పై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామ సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు తో కలిసి కడియపసావరం వైఎస్ఆర్ కాలనీ లో ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన ప్రజలకు వివరించారు. చందన నాగేశ్వర్ మాట్లాడుతూ
ఈ ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి,మన రాష్ట్రంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను రెండేళ్లలోనే 95 శాతం అమలు చేయడం జరిగిందన్నారు.
ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఎక్కడైనా ఏ కారణం చేతనైనా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అంద చేయాలన్న లక్ష్యంతో మన ప్రియతమ ముఖ్య మంత్రి వై.యస్ జగన్మోహన రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం అనే నినాదంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.రాష్ట్రంలో రైతు భరోసా, అమ్మఒడి,వై.ఎస్.ఆర్ చేయూత,ఆసరా, జగనన్న విద్యా దీవెన,వసతి దీవెన, వంటి పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తు,కుల,మత, రాజకీయాలకు ఆతీతంగా కేవలం అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు.
వైఎస్ఆర్ కాలనీ వాసులు చందన నాగేశ్వర్ కి స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్య గురించి వినతి పత్రాన్ని అందించారు. త్వరలోనే వైఎస్ఆర్ కాలనీ లో డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శుల రావిపాటి రామచంద్రరావు ,గిరజాల బాబు,కడియం మండలం అధ్యక్షులు యాదాల స్టాలిన్, మాజి సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు,ఎంపిటిసి సాపిరెడ్డి వీర దుర్గ కామేష్, వుటుకురి శైలజ గోవింద్, ఎంపీటీసీ ఆకుల సుధాకర్, మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి వీర శివాజీ,తోరాటీ శ్రీను, ఉడతండి సత్యనారయణ,జ్యోతుల వీరబాబు, జ్యోతుల అర్జున్,శీలం నరసింహం,గుబ్బల శ్రీను, తిరుమలశెట్టి శ్రీను, ఈలి గోపాలం, సలాధి ప్రసాద్, అరేటి వెంకటరావు, చీకట్ల మచరయ్యా, బొడపాటి మూర్తి, సర్పంచ్ కొండపల్లి పట్టియ్యా, తొకల శ్రీనివాస్, తాతపుడి బాబీ,, గన్నేశ్వర రావు,రాంబాబు, ఏలే వీర్రాజు,మెలిమీ భాస్కర రావు,శాఖ పట్టాభి,బట్టు చిన్ని, బాషా, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.