విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
– బీసీల సంక్షేమం మా అజెండా,బి.సి సేన పూర్తి స్థాయి నిర్మాణం
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు,బీసీ సేన రాష్ట్ర నాయకులు కార్తీక్ సింగంపల్లి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య,రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజులు బీసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియామకం చేసినప్పటికీ బడుగు బలహీవర్గాల జాతి అభివృద్ది మా యొక్క పోరాటం కొనసాగుతుంది.తనపై ఉంచిన నమ్మకాన్నికి కృతజ్ఞతలు తెలిపారు.బీసీ సంఘం లోని కొంతమంది నాయకులు సొంత పెత్తనం చేసి బీసీ సంఘానికి నష్టం కలిగిస్తున్నారని అన్నారు.ఉద్యమం వేరు రాజకీయ పార్టీవేరని ఉద్యమాలలో రాజకీయాలు తీసుకురాకూడదని హితవు పలికారు.స్థానిక బీసీ నాయకుల సహకారంతో బీసీసేనలో కమిటీలు వేసి బీసీసేన ను బలోపేతం చేస్తామని అన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజింగ్ కమిటీలో పనిచేసిన తాను బడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కొన్ని రాజకీయ పార్టీలు కుల మతాలాలు పై విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండి సోదరుభావంతో మెలగాలని,బీసీసేనలోని కొంతమంది నాయకులు సలోభం కోసం సొంత పెత్తనం చేసి బీసీ సంఘానికి నష్టం కలిగిస్తున్నారని అన్నారు.అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని అన్నారు.
బీసీ సేన జిల్లా అధ్యక్షులు దొమ్మేటి స్వర్ణకుమార్ మాట్లాడుతూ బీసీ సేన రాష్ట్ర నాయకులు కార్తీక్ సింగంపల్లి సేవలు బిసీ సేన రాష్ట్ర నాయకత్యం పట్ల మరింత బలం గా పనిచేయడం అభినందనీయమని అన్నారు.బీసీలు అంతా ఒక్క తాటిపై ఉండి బీసీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. బీసీ సేన నాయకులు ఉపేంద్ర మాట్లాడుతూ బీసీలను బలోపేతం చేసింది వార్డు కమిటీలు వేసి సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తామని అన్నారు. బీసీ సేన సంఘం నాయకురాలు తుల్లి పద్మావతి మాట్లాడుతూ బీసీ సంఘం ఒక కులానికి, పార్టీకి సంబంధించినది కాదని,అన్ని పార్టీలు అన్ని మతాలు వారు ఈ సంఘంలో ఉన్నారని అన్నారు.బీసీ సేన నాయకులు మాదాబత్తుల పండు మాట్లాడుతూ బీసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం జరిగిన సింగంపల్లి కార్తీక్ తో బీసీ సంక్షేమ సంఘం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన నాయకులు పిల్లి ఉపేంద్ర,తుళ్ళి పద్మావతి,ఎస్ కే షరీఫ్,ఆదిల్ భాషా,బాలు,శ్రీను, ఆనంద్,చిరంజీవి,దేవాదుల నాగసాయి, రాజకుమార్,కోటేశ్వరరావు, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.