విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణ:
*గ్రామ పంచాయతీల్లో చిల్లిగవ్వలేదని*
*కలెక్టర్ ను చేతులెత్తి వేడుకున్న గ్రామ పంచాయితీ ప్రధమ పౌరులు*
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం సెప్టెంబర్ 20
అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్దకు జిల్లా నలుమూలల నుంచి ర్యాలీతో వచ్చిన గ్రామపంచాయతీ సర్పంచులు సోమవారం నాడు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు మా నిధులు మాకు ఇప్పించండి 14, 15, వఆర్థిక సంఘం నిధులు తక్షణం పంచాయతీలకు రిలీజ్ చేయాలని నినాదాలు చేస్తూ, కలెక్టర్ స్పందన అర్జీ ఫిర్యాదు పరిష్కార వేదిక కు చేరుకుని అంబేద్కర్ కోనసీమజిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా వారికి స్పందన అర్జీ ఫిర్యాదు ఇచ్చి సర్పంచ్లందరూ మా నిధులు మాకు ఇప్పించండి అంటూ చేతులెత్తి వేడుకున్నారు. మా గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులు, శానిటేషన్, వీధి దీపాలు, (కరెంట్ బల్బులు) పనులు చేయించేందుకు గ్రామపంచాయతీ సర్పంచుల చేతులు చిల్లిగవ్వ కూడా లేదని గ్రామ వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి ఇచ్చిన ప్రాముఖ్యత మాకు ఇవ్వడం లేదని గ్రామ వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని పంచాయతీలకు అనుసంధానం చేయాలని వారికిచ్చే జీతాలు, జీతాలు పారిశుధ్య పనులకు, శానిటేషన్, కి, వీధి దీపాల మరమ్మత్తు పనులకు గతంలో జరిగినటువంటి పద్ధతిలో కొనసాగించేలా, ప్రస్తుతం సచివాలయలకు అభివృద్ధి కొరకు ఇస్తున్నటువంటి 20 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ సర్పంచులు చేతుల మీదుగా కార్యక్రమాలు జరగాలని. మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సిసి రోడ్లు వేయించడం, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయటం, వైరల్ ఫీవర్, డెంగ్యూ జ్వరాలు, వంటివి ప్రబలుతున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ఎటువంటి చర్యలు, పనులు చేయించట్లేదని మా మొహాల మీదే సీదరించుకుంటూ అసహనంతో తిడుతున్నారని 14, 15, వ ఆర్థిక నిధులు కరెంట్ బిల్లులు కట్టే నెపంతో పంచాయతీలో ఉన్నటువంటి నిధులను ప్రభుత్వం ఖాళీ చేసింది. ప్రజలకు సమాధానం చెప్పలేక సర్పంచులు అయిన మేము గ్రామంలో తిరగలేకపోతున్నామని కలెక్టర్ వారికి మొరపెట్టుకున్నారు
వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 14 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయితీలకు జమ చేయాలి చేయకపోతే నిరాహార దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు సన్నద్ధమవుతావని హెచ్చరించారు