విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉప్పలగుప్తం:
పేదలకు వరం ఉచిత వైద్య శిబిరం…..
విశ్వం వాయిస్ న్యూస్ రీడర్ ఉప్పలగుప్తం.
ఉప్పలగుప్తం మండలం. కిత్త న చెరువు గ్రామంలో డాక్టర్ రవితేజ గారి ఆధ్వర్యంలో మరియు ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను కిత్తన చెరువు పంచాయతీకి చెందిన సీతారాంపురం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు మరియు అన్ని రకాల పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనిపై గ్రామంలో ప్రజలు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవితేజ దంపతులను గ్రామస్తులు మరియు నాయకులు దుశా లువ మరియు పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం ద్వారా ఎంతోమంది పేద రోగులకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి, వారిని కాపాడినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేర్ ఆస్పటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కారేం రవితేజ మరియు డాక్టర్ డమరాకుల శ్రావణి దంపతులు రోగులకు ఉచితంగా వైద్యంతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఏ సమయంలోనైనా ఎంత అర్ధరాత్రి అయినా రోగులకు వైద్యం అందించడంలోను, వారి ప్రాణాలను కాపాడడంలోనూ అందవేసిన చేయిగా ఉన్న రవితేజ దంపతులకు రుణపడి ఉన్నామన్నారు. భవిష్యత్తులో కూడా తమ గ్రామాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుటకు డాక్టర్ రవితేజ దంపతులు కృషి చేయాలని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జంగా రాంబాబు, దేవరపల్లి నాని బాబు, ఎలిపే రాజీవ్, జె వి వి సత్యనారాయణ ప్రసాదులతో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు