విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణ:
*ఇసుక అక్రమ తరలింపు పై కొరడా జులిపిస్తున్న ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి*
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం సెప్టెంబర్ 20 అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయం నందు
ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడునని.
ఏవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డా, అధిక ధరలకు విక్రయించినా పరిమితికి మించి ఇసుక కలిగి ఉన్నా కఠిన చర్యలు తీసుకోబడును.
జిల్లాలో ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్ లు, స్టాక్ పాయింట్ల ద్వారానే ఇసుక రవాణా జరగలి.నిబంధనలు ఉల్లంఘించి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోబడును.
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్, జయప్రకాశ్ ,పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జెపివిఎల్) టెండర్ల ద్వారా అనుమతి పొందారని
ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎస్పీ కార్యాలయం నందు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందిన వెంటనే పోలీస్ , సెబ్ టీం, రెవెన్యూ, మైన్స్అండ్ జియాలజీ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది