WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

స్పందన అర్జీ దారులు పట్ల స్పందించే అధికారుల తీరు క్రియాత్మకంగా ఉండాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*స్పందన అర్జీదారులు పట్ల స్పందించే అధికారుల తీరు క్రియాత్మకంగా ఉండాలి*

 

*కలెక్టర్ హిమాన్సు శుక్లా వెల్లడించారు*

 

విశ్వం వాయిస్ న్యూస్ అమలాపురం 2022 సెప్టెంబర్ 20 అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం తూచ తప్పకుండా నిర్వహించే కార్యక్రమానికి వచ్చే

: స్పందన అర్జీల పట్ల స్పందించె తీరు క్రియాత్మకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు గల స్పందన హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సుమారు 192 అర్జీలను అర్జీదారుల నుంచి వ్రాతపూర్వకంగా స్వీకరించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా విచా రించి నిబంధనలకు లోబడి తగు పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో చూపాలని, అదేవిధంగా అర్జీదారుని ఫోటోలు స్పందన వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ఆయా సమస్యల సాధ్యాసాధ్యా లను ముందుగా అంచనా వేసి తదుపరి మార్గదర్శకాలుగా అనుగుణంగా తగు పరిష్కార మార్గాలు చూపాలన్నారు సామాజిక భద్రత పింఛన్లు రెవెన్యూ అంశాలు, దివ్యాంగుల సమస్యలు సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చాలని మరియు 14వ ,15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ కాలే దంటూ సర్పంచులు వినతిపత్రం జిల్లా కలెక్టర్ కు అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 21 నుండి 24వ తేదీ వరకు నులిపురుగు నివారణ దినోత్సవాలు నిర్వహిం చాలని పాఠశాల విద్య వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశిం చారు. నులిపురుగుల వల్ల పిల్లలలో జీవన ప్రమాణాలు మరియు శారీరక మానసిక ఎదుగుదలకు సకాలంలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. జాతీయ నులిపురు గుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాల నిర్వహణ సన్నద్ధతపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగాచేపట్టాయన్నారు.పురుగులు రోజూ వేలాది గుడ్లు పెడతాయని మరియు ప్రధానంగా మానవ శరీరానికి అవసరమైన పోషకాలను తింటాయన్నారు. వయోజన పురుగులు సాధారణంగా ఆహారం మరియు మనుగడ కోసం మానవ ప్రేగులలో నివసిస్తాయని, ప్రతిచోటా వ్యాప్తి చేస్తాయని. ఈ కలుషితమైన నీటి వనరులను తీసుకోవడం వల్ల రక్తంలోఇనుము మరియు ప్రోటీన్ కోల్పోవడం పోషకాహార లోపం వల్ల

పోషకాహారం తీసుకోవడం తగ్గి

శరీరంలో తక్కువ ఆక్సిజన్ సరఫరా

బలహీనమైన మానసిక, శారీరక స్థితికి చేరుకొని ఎదుగుదల కుంటుపడు తుoదన్నారు. పురుగులు చాలా కాలం పాటు చికిత్స చేయకుండా లేదా గుర్తించ బడకుండా ఉంటే, అది పిల్లల ఆరోగ్యం మరియు అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలకు దారితీ స్తుందని. అందువల్ల, పిల్లలకు నులిపురుగుల నిర్మూలన కోసం, ప్రభుత్వం ఒక నిర్దిష్ట సిఫార్సు చేసిన యాంటీ-హెల్మిన్థిక్ ఔషధమని, పిల్లల వయస్సు ఎంత అనేదానిపై మందుల మోతాదు ఆధారపడి ఉంటుందని, క్రమబద్ధంగా చికిత్స చేయబడిన పిల్లవాడికి ఇతర ఇన్ఫెక్షన్‌లకు కూడా తగ్గి మెరుగైన అభ్యాస సామర్థ్యాలను కలిగి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతారన్నారు. నులి పురుగులను నిర్మూలించే లక్ష్యంతో 1-19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు జిల్లాలో 2, 88,473 ఉంది ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతి బిడ్డను పురుగు రహితంగా మార్చ డానికి భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ యొక్క చొరవతో చేపట్టిందని,నులిపురుగుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ము ఖ్యంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు , అత్యంత హాని కలిగించే పిల్లలకు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభిం చిందన్నారు పరాన్నజీవి నులి పురుగులు మనుషులకు మరియు జంతువులకు సమాజానికి ముప్పని, నులిపురుగుల వల్ల పిల్లల్లో జీవన ప్రమాణాలు తగ్గుతా యని, శారీరక ఎదుగుదల, మానసి క ఎదుగుదల తగ్గి, పాఠశాలల్లో ఉత్పాదకత తగ్గి, పిల్లల హాజరుపై ప్రభావం చూపు తుందని వారి విద్య మరియు భవిష్యత్తు దెబ్బ తింటుందని, అందువల్ల, పిల్లలకు సకాలంలో మరియు సరైన డైవా ర్మింగ్ అవసరమన్నారు. లేనిపక్షంలో ఈ పురుగులు పేగుల్లో చేరి బలహీనత, రక్తహీనత, అజీర్ణం, బరువు తగ్గడం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు వంటివి సంభవించే అవకాశం ఉందన్నారు. నులి పురుగుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతైనా అవసరమని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్తహీనతను చక్కది ద్దాలని, సంకల్పించడం జరిగింద న్నారు. అల్బెండ జోల్ అనేది నులిపురుగుల నివారణ ఔషధమని పిల్లల వయస్సు మరియు శరీర బరువును బట్టి టాబ్లెట్ రూపంలో అందించ బడుతుందoన్నారు , పిల్లలకు సకాలంలో మరియు సరైన డైవార్మింగ్ అవసరమన్నారు. మధ్యాహ్నం భోజనం తిన్న పిదప ఆల్బెండజోల్ మాత్రాలను తగిన మోతాదులో ఇవ్వాలని సూచిం చారు ఈ సందర్భంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికను మరియు జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు బోదవ్యాధి వంటి వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలని మురికి నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో దోమల లార్వాలు వ్యాప్తి చెందకుండా దోమల నియంత్రణ పిచికారిని చేపట్టా లన్నారు. అవసరమైతే గంభూజియ చేప పిల్లలను ఆయా కుంటాలలో వదిలి లార్వాలను నిర్మూలిం చాలన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారిని పద్మశ్రీ రాణి ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సిహెచ్ భరత్ లక్ష్మి సిపిఓ వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, బీసీ కార్పొరేషన్ అధి కారి బి వి రమణ డిపిఓ వి కృష్ణకు మారి, వ్యవసాయ శాఖ జేడి వై ఆనంద్ కుమారి, పశుసంవర్ధక శాఖ జె డి డాక్టర్ జైపాల్ ఉద్యాన శాఖాధికారి మల్లికార్జునరావు, డీఎస్ఓ ఏ పాపారావు, డిఎం పౌరసరఫరాల పౌరసరఫరాలశాఖటీ.తులసి, మార్కెటింగ్ శాఖ ఏడి కె విశాలాక్షి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గ్రంధి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ జేడీ షేక్ లాల్ మహమ్మద్, ఏడి సర్వే గోపాలకృష్ణ ,జల వనరుల శాఖ ఈ ఈ రాంగోపాల్, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్ ,గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు శ్రీనివాస్ డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్, ఏపీ డి ఎం ఎం జిలాని, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి రవి సాగర్, పంచాయతీరాజ్ ఎస్సీ టీ చంటిబాబు,వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement