విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
జగనన్న కాలనీలో మౌలిక వసతులను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి…
ఆర్డీవో పీవీ సింధు సుబ్రహ్మణ్యం…
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
జగనన్న కాలనీలో మౌలిక వసతులను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని,
పేదలందరికీ ఇళ్లు పథకంలో నివేశన స్థలాలు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం ఆర్డీవో పి వి సిందు సుబ్రహ్మాణ్యం ఆదేశించారు. మండల కేంద్రమైన రాయవరం మండల ప్రజాపరిషత్ సమావేశపు హాల్లో అధికారులతో ఆర్డీవో సిందు గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో మాట్లాడుతూ మండలంలోని 12 గ్రామాల్లో 19 సచివాలయాల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాలు వేగవంతం గా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నివేశన స్థలాలు మంజూరైన లబ్ధిదారులకు గృహ నిర్మాణాలపై అవగాహన కల్పించి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. 12 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రగతి ఏవిధంగా ఉంది, కాలనీల్లో కల్పించాల్సిన మౌళిక వసతులపై ఆర్డీవో గృహనిర్మాణశాఖ అధికారులను ఆరాతీశారు. ఈకార్యక్రమంలో గృహనిర్మాణశాఖ డీఈఈ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో డి.శ్రీనివాస్, తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, పంచాయతీరాజ్ డి ఏ వి రామనారాయణ, హౌసింగ్ ఏఈ కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ చైతన్య కుమారి, వెలుగు ఇంచార్జ్ ఏపిఎం నాజర్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో సుధారాణి, ఆయా గ్రామాల నుండి వచ్చిన సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.