విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
ఎస్ హెచ్ జి సభ్యులకు గృహ రుణాలు సిసిఎల్ లోన్ ఇప్పించాలి….
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్డిఏ పిడి డాక్టర్ శివశంకర్ ప్రసాద్….
రాయవరం విశ్వం వాయిస్ న్యూస్: ఎస్ హెచ్ జి గ్రూపులో ఉండి గృహ రుణాలు తీసుకొనుటకు అంగీకరించిన లబ్ధిదారులకు సిసిఎల్ లోన్ 35 వేల రూపాయలు ఇప్పించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్డిఏ పి డి డాక్టర్ శివ శంకర్ ప్రసాద్ ఆదేశించారు. మండల కేంద్రమైన రాయవరం వెలుగు కార్యాలయంలో రామచంద్రపురం ఏరియా కోఆర్డినేటర్ జి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వివోఏలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్డిఏ పిడి డాక్టర్ శివశంకర్ ప్రసాద్ బుధవారం పాల్గొని మాట్లాడుతూ మండలంలో ఉన్న ఎస్ హెచ్ జి గ్రూపులో ఉండి గృహ రుణాలు తీసుకొనుటకు అంగీకరించిన లబ్ధిదారులకు సిసిఎల్ లోను ఇప్పించాలని ఆయన పేర్కొన్నారు. స్త్రీ నిధి ఏడు కోట్ల 55 లక్షల రూపాయల టార్గెట్ ఉండగా ఇప్పటికీ రెండు కోట్ల 30 లక్షల రూపాయలు శ్రీనిధి సంఘ సభ్యుల జీవనోపాధి కొరకు ఇచ్చినట్లు తెలిపారు. మండలంలో సుమారు ఒక వెయ్యి 11 గ్రామ సంఘాలకి 39 కోట్ల 97 లక్షలు బ్యాంకు లింకేజ్ లోన్లు 2022 నుండి 2023 టార్గెట్ చేయవలసి ఉండగా ఇప్పటివరకు 671 సంఘాలకు 12 కోట్ల 91 లక్షల లోన్లు మంజూరు చేసినట్లు ఏడి తెలిపారు. సమీక్ష సమావేశం లో వివోఏలను పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఏపిఎం నాజర్, వెలుగు సీసీలు ప్రసాద్, కొండబాబు, స్త్రీ నిధి మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు.