విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:
విదేశాలకు వెళ్లే ప్రవాస ఆంధ్రులు నకిలీ ఏజెంట్లు చేతిలో మోసపోవద్దని ఏపీ ఎన్నార్టీసి సీఈవో దినేష్ కుమార్ సూచించారు.బుధవారం రాజమహేంద్రవరం అరుణ ఫంక్షన్ హాల్లో ఏపీ ఎన్నార్టీ సొసైటీ ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్లే ప్రవాస ఆంధ్రులకు, ఏజెంట్లకు,ఎన్జీవోలకు, ప్రజలకు, బాధితులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎన్ఆర్టి సి సీఈవో దినేష్ కుమార్, చైర్మన్ మేడాపాటి వెంకట్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విదేశీయులకు వెళ్లే ప్రవాస ఆంధ్రులకు భద్రత,భరోసా కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్నార్టీ ద్వారా విదేశాలలో ఉన్న ప్రవాస ఆంధ్రులకు 26 రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో విదేశాలలో చిక్కుకున్న 40 వేలమంది ప్రవాస ఆంధ్రులను రాష్ట్రానికి రప్పించామని తెలిపారు.విదేశాలకు వెళ్లే వారు అక్రమ వలసలు ద్వారా కాకుండా, సక్రమ వలసలు ద్వారా విదేశాలకు వెళ్లాలని సూచించారు.ఉద్యోగ వివిధ పనుల నిమిత్తం వలసలు వెళ్లే ప్రవాస ఆంధ్రులు గల్ఫ్,కువైట్, మస్కట్ ఇతర దేశాలలో అనేక ఇబ్బందులు పాలవుతున్నారని తెలిపారు.నకిలీ వీసాల ద్వారా ఏజెంట్లు అమాయకులను విదేశాలకు పంపిస్తున్నారని పేర్కొన్నారు.నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని లైసెన్స్ కలిగిన ఏజెంట్లు తెలంగాణాలో 92 మంది ఉండగా,ఆంధ్రప్రదేశ్లో 24 మంది ఉన్నారని తెలిపారు.ఉభయ రాష్ట్రాల్లో మొత్తం 116 మంది రిజిస్టర్ కలిగిన ఏజెంట్లు ఉన్నట్లు వివరించారు.నకిలీ ఏజెంట్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. నకిలీ ఏజెంట్లు చేతిలో మోసపోయిన అమాయకులకు ఆసరాగా నిలిచి వారిని
ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవాస ఆంధ్రభరోసా భీమా పథకం ద్వారా వారిని ఆదుకుంటామని అన్నారు.విదేశాలకు వెళ్లే ప్రవాస ఆంధ్రులు ఏపీ ఆర్టిఎస్ ను సంప్రదిస్తే ఇబ్బందులు పడకుండా వారికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు.వెంకట్ డిజిటల్ విధానంలో వీరికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి( కువైట్ ),ఏపీ ఎన్నార్టీ సొసైటీ రీజనల్ కోఆర్డినేటర్ (కువైట్ )నాయిని మహేశ్వర్ రెడ్డి, డి.అర్.ఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్,నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ చైర్ పర్సన్ నల్లబోతుల భవాని,ఖాదీ బోర్డు డైరెక్టర్ పిల్లి నిర్మల, ఎన్జీవోలు అమీర్ భాషా, శేషారత్నం,కొల్లి థామస్,గట్టి మాణిక్యాలరావు,ఏపీ ఎన్నార్టీ సొసైటీ డిప్యూటీ డైరెక్టర్ కరీం,సరోజిని తదితరులు పాల్గొన్నారు. విదేశాలకు వెళ్లి ప్రవాస ఆంధ్రుల సహాయం కోసం కో ఆర్డినేటర్ లు 24/7 365 రోజులు అందుబాటులో ఉండే విధంగా ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్ 918632340678,918500027 678.ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సహాయం పొందవచ్చునని తెలిపారు.