విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి ఆర్ పురం:
పురిటి గడ్డకు ….”” స్నేహితుల సాయం.””
– ఆ కుటుంబాలకు కొండంత అండగా వి.అర్.పురం ఫ్రెండ్స్.
– మనఊరికి ..మనం సాయం కార్యక్రమంలో వి.అర్.పురం ఫ్రెండ్స్ చేయూత.
– మీరు మన ఊరు కోసం, ప్రజల కోసం చేస్తున్న సేవలు అభినంద నీయమని అంటున్న గ్రామస్థులు.
– వీ ఆర్ పురం ఫ్రెండ్స్ గ్రూప్ ఆద్వ ర్య o లో సాయం.
– డాక్టర్ తెల్లం వెంకటరావు , నిఖిత ఆసుపత్రి వారి సహకారంతో
వీ ఆర్ పురం. ( విశ్వం వాయిస్ న్యూస్) 25:- బాల్యంలో కలిసి మెలిసి ఎటువంటి తారతమ్యాలు లేకుండా సాగిన వారి ప్రయాణం . అందరు ఒక తాటి మీద నిలబడి పురిటి గడ్డ రుణం తీర్చుకుంటున్నారు. వారే వి.అర్.పురం వాస్తవ్యులు ఫ్రెండ్స్ . నేడు వారు చేసే వృత్తిరీత్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బయటకు వెళ్ళేరు. కానీ పురిటి గడ్డను , ఇక్కడ ఉన్న బంధాలను మర్చిపోలేదు. గ్రామంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా, మేమున్నాం అనే భరోషా ఇచ్చారు. ఏ పండుగ వచ్చినా ఇట్టే తమ మాతృ గడ్డపై వాలి పోతారు. వారు దూరంగా ఉన్న బంధాలు బంధుత్వాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడు తమ కుటుంబాల కోసమే కాక , వారు ఉన్న ఊరి ప్రజలను మర్చిపోకుండా ఎంతో కొంత సాయం చేస్తున్నారు. వారి బాల్యంలో తిరిగిన ప్రాంతాలను మర్చిపోలేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నాం అనే భరోశ కల్పిస్తున్నారు. గోదావరి వరదలకు సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ వారి మానవత్వం చాటి దాతృత్వం చేశారు.వారే వి.అర్.పురం ఫ్రెండ్స్ , అదే విధంగా ఇదే మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడి ప్రజలకు సేవలు అందించిన నిఖిత ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు సహకారంతో వి.అర్.పురం ఫ్రెండ్స్ వడ్డిగూడెం గ్రామ పంచాయతీలో గ్రామాల ప్రజలకు దుప్పట్లు, చీరలు అంధించారు.
* పురిటి గడ్డ రుణం తీర్చుకుంటాం.
ఇటీవల గ్రామాలను ముంచిన గోదావరి వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు వి ఆర్ పురం ఫ్రెండ్స్ చేసిన సాయం మరువ లేనిదని తెలంగాణ రాష్ట్ర భద్రాది జిల్లా విద్యా శాఖ ఎడియి గమానియల్ అన్నారు.ఆదివారం దర్మతాల్ల గూడెం. వడ్డి గుడెం గ్రామాలకు చీరలు. టవల్స్.దుప్పట్లు పంపిణీ కార్యక్రమం లో అయన మాట్లాడారు. సాయం చేసే గుణం వుండాలి.అలాంటి దాతృత్వం వున్న వాళ్లు గొప్ప వాళ్ళు అన్నారు. ఈ కార్య క్రమం లో సర్పంచ్ నర్సమ్మ. ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు ఆర్ ఆర్ కె ప్రసాద్. రమేష్ గౌడ్. కోటి. వెంకన్న. గబ్బర్. అమీర్. జహుర్. రహీమ్ ఉదయ్ కుమార్. ఆర్టీసి వెంకన్నలు.పాల్గొన్నారు.