– సుమారు 5 కిమీ రోడ్డు మంజూరు చేయాలని వినతి
– గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
తన పరిధిలో గల పురుషోత్తపట్నం , గుండాల పంచాయతీల్లోని రోడ్లు , విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని ఎల్లవరంలో గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు పురుషోత్తపట్నంలోని సెయింట్ ఆన్స్ పాఠశాల నుండి పాత గుండాల గ్రామం వరకు సుమారు 5 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా పాడై పోయి గుంతలుమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు గుండాల ఎంపిటిసి వెంకట్రామిరెడ్డి వివరించారు. 5 కిమీ రోడ్డును మంజూరు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఎమ్మెల్యేను కోరారు. దాంతో ఎమ్మెల్యే ధనలక్ష్మి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్టు ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి తెలిపారు.