– గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చందన నాగేశ్వర్ వెల్లడి…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం రూరల్:
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జన రంజిక పాలన అందిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని కవలగొయ్యి గ్రామంలో రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డనేటర్ చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చందన నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజిక పాలన అందిస్తున్నారని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ప్రవేశపెట్టి సంక్షేమ అభివృద్ధి పథకాలను లబ్ధిదారుల ఇళ్ళకే అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని వివరించారు.అమ్మ ఒడి పథకం,వాహన మిత్ర, కాపు నేస్తం,రైతు భరోసా,తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్దిని ప్రజలకు వివరించారు. ప్రజలు యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు.డ్రైనేజీ లు, వీధి దీపాలు, శానిటేషన్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.గడపగడపకు మన ప్రభుత్వం అందించిన పథకాలను ప్రభుత్వం నుంచి పొందిన లబ్దిని వివరిస్తూ ప్రభుత్వానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ కందిరీగల సత్తిబాబు, మాజీ ఎంపీటీసీ వేముల ఏసుబాబు, తీగిరెడ్డి శ్రీనివాస్, కౌలూరి చంటిబాబు, జాజుల శ్రీను, పల్లేటి ఏసురత్నం, పల్లేటి చిన్ని, రేలంగి ఎర్ర శ్రీను, పిల్లి శ్రీను, నక్క శ్రీను, నిచ్చెనగుళ్ళ రామకృష్ణ ,ఎం కనకమహాలక్ష్మి,టీ.సుధారాణి,మాజీ ఎం.పి పి రేలంగి వీర వెంకట సత్యనారాయణ,పంచ గట్ల నాగేశ్వరరావు, చవాకులు సత్యనారాయణ, మద్దిల రమణ, అల్లంపల్లి శ్రీను, మారిశెట్టి వెంకన్న, అత్తిలి శ్రీనివాస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.