విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
జవాబుదారితనం కోసం ఆర్ టి ఐ యాక్ట్ 2005
ఆర్ టి ఐ యాక్ట్ పై పూర్తిస్తాయి అవగాహన కలిగి ఉండాలి
– రాష్ట్ర ఆర్.టి.ఐ చట్టం కమీషనర్ బివి రమణ కుమార్
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
జవాబుదారితనం కోసం ఆర్ టి ఐ యాక్ట్ 2005 లో భారత దేశంలో అమలులోనికి వచ్చిందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ బివి రమణ కుమార్ పేర్కొన్నారు.గురువారం స్థానిక ఆనం కళా కేంద్రంలో సమాచార హక్కు చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అవగాహన సదస్సు కి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ బివి రమణ కుమార్ మాట్లాడుతూ 2005వ సంవత్సరం ముందు ప్రభుత్వ కార్యాలయాలు నుంచి ఏదైనా సమాచారం తీసుకోలేని పరిస్థితి వుండేదన్నారు.ప్రజలు సమాచారం అడిగితే మీకెందుకు సమాచారం అనే ధోరణిలో అధికారులు ఉండేవారన్నారు. నేడు సమాచార హక్కు చట్టం అమలులో ఉన్నందున ప్రజలు తమకు కావలసిన సమాచారాన్ని నిర్నీత గడువు లోగా పొందే అవకాశం ఉందని అన్నారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖలు దరఖాస్తు దారులకు సమాచారం అందిస్తు న్నాయన్నారు. దీని వలన అధికారుల్లో జవాబుదారీ తనం, విధుల్లో పారదర్శికత పెరుగుతుందన్నారు. అధికారులందరికి ఆర్ టి ఐ యాక్ట్ పై పూర్తిస్తాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో లోని అన్ని కార్యాలయ ఇన్ఫర్మేషన్ అధికారులు సమాచార హక్కు చట్టాల సెక్షన్లు పై అవగాహనా ఉండాలి. ఆర్ టి ఐ యాక్ట్ అమలు పై జిల్లాలో యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. నిర్ణీత పద్ధతిలో రిజిస్టర్ లను నిర్వహించాలని ఆదేశించారు.
అన్ని కా ర్యాలయాల్లో పబ్లిక్ ఇన్ఫర్మేష న్ అధికారి, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి, ఫోన్ నెంబర్ లతో తప్పనిసరిగా బోర్డు లు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తెలిపారు. సమాచార హక్కుపై నిర్దిష్టమైన మార్గదర్శకత్వం పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సమాచార హక్కు కమిషనర్ ఆధ్వర్యంలో కార్యసాల నిర్వహించడం చక్కటి అవకాశం అన్నారు. ఏ సమాచారం ఇవ్వవొచ్చు, ఎంత సమయంలోగా ఇవ్వాలి, ఏ సమాచారం ఇవ్వకూడదో కూడా స్పష్టం ఉందన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ, ప్రజలు కోరిన సమాచారం ఇవ్వడానికి సమాచార హక్కు చట్టం ఆయుధంగా పనిచేస్తుంది అన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ ఈ చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండి ఉన్నారని ఇటువంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. ముఖ్యంగా ఈరోజు అవగాహన కార్యక్రమానికి కార్యసాలకు హాజరైన న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసస్ ఆధారిటీ, కె. ప్రత్యూష కుమారి,డి.ఆర్. ఓ జి. నరసింహులు,అడిషినల్ ఎస్.పి.లు, సీ. హెచ్. పాపా రావు, లతా మాధురి, రజని,ఆర్డీఓలు, ఎ.చైత్ర వర్షిణి, ఎస్. మల్లిబాబు, జర్నలిస్ట్ వరదా నాగేశ్వరరావు,జిల్లా అధికారులు, పాల్గొన్నారు.