WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

నేడే ఎ.పి ఎం.ఎఫ్‌ ఉమ్మడి జిల్లా మహాసభ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

  • టాగ్స్
  • Apmf
ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌(ఎపిఎంఎఫ్‌) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మహాసభ ఆదివారం రాజమహేంద్రవరం చెరుకూరి ఫంక్షన్ హాల్ లో జరగనుంది.
ఏర్పాట్లు చేస్తున్న ఆహ్వాన కమిటి ,
మంత్రులు,శాసన సభ్యులు,అధికారులు,ఏపీ ఎం ఎఫ్ ముఖ్య రాష్ట్ర నాయకులు పాల్గొనేదరు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌(ఎపిఎంఎఫ్‌) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మహాసభ ఆదివారం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఆతిథ్యం చారిత్రక రాజమహేంద్రవరం నగరం ఇవ్వనుంది. నగరంలోని జె.ఎన్‌ రోడ్డులో గల చెరుకూరి కళ్యాణ మండపంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును ఆహ్వాన సంఘం పర్యవేక్షిస్తుంది. నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేటి కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 800 మంది జర్నలిస్టులు ఆ మహాసభలో పాల్గొననున్నారని ఆహ్వాన సంఘం ప్రతినిధులు పివివి సత్యనారాయణ(సత్య),డి.ఎ లింకన్‌, నమ్మి శ్రీనివాస్‌(ఎన్‌.ఎస్‌), ఎంవి సత్యనారాయణ మూర్తి(సతీష్‌), ఎస్‌.సత్యనారాయణ(సతీష్‌), పి.చిరంజీవిరెడ్డి, కె.శ్రీనివాసరావు(నాని), కె.కిరణ్‌కుమార్‌ రాజు వెల్లడించారు.ఈ మహాసభకు ఎపిఎంఎఫ్‌ వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఢల్లీ బాబు రెడ్డి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖ, సమాచార పార సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హోం, విపత్తుల శాఖ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐ.జె.యు) ప్రధాన కార్యదర్శి సబీనా ఇంద్రజిత్‌, స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వీరభద్రరావు పాల్గొంటారని, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె మాధవీలత, రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్మెంట్‌ అధారిటీ (రుడా) ఛైర్‌ పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి జ్వోతిప్రజ్వలన చేస్తారని వెల్లడించారు. విశిష్ట అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కాకినాడ ఎంపీ వంగా గీత, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పి.రవీంద్రబాబు, షేక్‌ సాబ్జీ, ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐ.వి), జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ విప్పర్తి వేణు గోపాల్‌ రావు, డి.సి.సి.బి ఛైర్మన్‌ ఆకుల వీర్రాజులతోపాటు, గౌరవ అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు, అనపర్తి ఎమ్మెల్య డాక్టర్‌ సత్తి సూర్య నారాయణ రెడ్డి, మండపేట ఎమ్మెల్యే వి.జోగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్య చిర్ల జగ్గిరెడ్డి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌, మాజీ మంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్‌ రెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్‌, పలువురు ప్రముఖులు చందన నాగేశ్వర్‌, శ్రిఘాకొళ్ళపు శివరాం సుబ్రహ్మణ్యం, కందుల దుర్గేష్‌, ఆదిరెడ్డి వాసు, గన్ని కృష్ణ, పంతం కొండల రావు, సోము వీర్రాజు,అనుశ్రీ సత్యనారాయణ, గిరిజాల రామతులసి, కోళ్ళ అచ్యుతరామారావు (బాబు),బొమ్మన జయకుమార్‌,చల్లా శంకర్రావు,తాటిపాక మధు, టి.అరుణ్‌,తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement