విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:
ఆరోగ్యకరమైన జీవన విధానానికి బేరి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉత్పత్తులు వినియోగించాలని జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం,శీలం నూకరాజు కంపెనీ సమీపంలో భేరి గ్రూప్ ఆఫ్ కంపెనీ అవుట్ లెట్ షోరూమ్ ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్యాష్ కౌంటర్ ను బి.వి.ఎన్. రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ నేడు ఆహార ఉత్పత్తులలో కల్తీలు జరుగుతున్న కాలంలో కల్తీలకు తావు లేకుండా పూర్వకాలంలో గానుగ నుంచి తీసిన నూనె ఉత్పత్తులు అందిస్తున్నట్లు భేరి గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రజల ఆరోగ్యం కోసం నాణ్యమైన నూనె,11 రకాల పచ్చళ్ళు, కారప్పొళ్ళు, అప్పడాలు,ఇతర ఆహార పదార్థాలు,ఉత్పత్తులు అందిస్తుందని అన్నారు. ప్రజలు భేరి గ్రూప్ ఆఫ్ కంపెనీ వినియోగించు కొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
కంపెనీ యజమాని నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కాలుష్యానికి దూరంగా భేరి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉత్పత్తులు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన నూనె ఉత్పత్తులు, ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని లక్ష్యంతో రాజమహేంద్రవరంలో అవుట్ లెట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఉత్పత్తులను రాజమహేంద్రవరం నగర దర్శన ప్రాంత ప్రజలు వినియోగించు కోవాలని కోరారు.అనుశ్రీ సత్యనారాయణ , సతీమణి అనురాధ దేవి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమంలో భేరి శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మణరెడ్డి, మేడపాటి సూర్యనారాయణ రెడ్డి,తమ్మన నాగేశ్వరరావు,ఎర్రశెట్టి నల్లబాబు తదితరులు పాల్గొన్నారు.