కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా గౌతమ్ పిలుపు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ambajipeta:
రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ను జయప్రదం చేద్దాం.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా గౌతమ్ పిలుపు.
అంబాజీపేట ( విశ్వం వాయిస్ ప్రతినిధి )
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకూ 3,575 కి. మీ జరుగుతున్న పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో విజయవంతం చేయడానికి డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలిరావాలని జిల్లా అధ్యక్షుడు జంగా గౌతమ్ పిలుపు నిచ్చారు. సోమవారం అంబాజీపేట మండల కేంద్రంలోని ఎస్.ఎన్.ఎం కాలేజీ ఆవరణలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి జంగా గౌతమ్ అధ్యక్షత వహించారు. ఈసమావేశానికి అమలాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జంగా గౌతమ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొట్లాదిగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో లక్షలాదిగా ప్రజలు రాహుల్ గాంధీ వెంట నడవడానికి సిద్దం అవుతున్నారని గౌతమ్ చెప్పారు.
అక్టోబరు 18 నుండి 21 వరకు కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నట్లు గౌతమ్ తెలిపారు.
జిల్లాలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారత్ జోడో యాత్ర లో పాల్గొనడానికి సిద్దం అవుతున్నారని గౌతమ్ చెప్పారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీకట్ల అబ్బాయి, కామన ప్రభాకర్ రావు, ముషిని రామకృషారావు, ములపర్తి మోహన్ రావు, ఇసుకపట్ల సతీష్ కుమార్, దోనిపాటి విజయ లక్ష్మి, వడ్డి నాగేశ్వరరావు, మాచవరపు శీవన్నారయన, యార్లగడ్డ రవీంద్ర, దేవరపల్లి రాజేంద్ర బాబు, వంటెద్దు బాబీ, అర్. డి. ఖాన్, దామిసెట్టి జయ, గెడ్డం సురేష్ బాబు, షకీలా, కే. సరోజినీ, కుమార్ సింగ్, ఆదుర్తి నారాయణ మూర్తి, చిలకపాటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.