విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరం:
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాటశాలలు అభివృధ్ధి. ఎమ్ ఎల్ సీ తోట త్రిమూర్తులు.
కపిలేశ్వరపురం మండలం(విశ్వం వాయిస్) లో నాడు నేడు సెకండ్ ఫేస్ కార్యక్రమంలో పలు పటసాల అభివృధ్ధి పనులకు ఎమ్ ఎల్ సీ తోట త్రిమూర్తులు భూమి పూజ చేశారు. టేకి గ్రామంలో అదనపు తరగతులు నిర్మాణానికి,కపిలేశ్వరపురం గ్రామంలో దేవి సెంటర్, కొ రాటి వారి వీది, కొత్తూరు పాటశాలలో మరుగు దొడ్లు, వంట గదులు,మరమత్తులు వగైరా పనులు కోసం భూమి పూజ చేశారు. మాచర ఉన్నత పాఠశాలలో బాలికల జూనియర్ కాలేజి ప్రారంభించారు. మారుమూల గ్రామాల్లో బాలికలు ఉన్నత విద్య అభ్యసించాలనే సదుద్దేశ్యంతో మాచర గ్రామంలో జూనియర్ కాలేజి ఏర్పాటు చేయడం జరిగిందని, తోట త్రిమూర్తులు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు కు ధీటుగా ప్రభుత్వ పాటశాల లు కార్పొరేట్ స్థాయిలో అభివృధ్ధి చేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని తోట త్రిమూర్తులు అన్నారు. మాచర ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి రైల్వే డిపార్ట్ మెంటు లో ఉద్యోగం పొందిన స్థానిక విద్యార్దిని చిక్కమ్ నాగ సీత ను ఎమ్ ఎల్ సి తోట త్రిమూర్తులు శాలువా కప్పి సత్కరించారు. నాడు నేడు అభివృధ్ధి పనుల భూమి పూజ విచ్చేసిన ఎమ్ ఎల్ సీ తోట త్రిమూర్తులు కు అడుగు అడుగున వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బ్రహ్మ రథం పట్టారు. ఎంపీపీ మేడి శెట్టి సత్యవెని దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, టేకి, మాచర,కపిలేశ్వరపురం సర్పంచ్ లు కుక్కల నాగమని, వాశంసెట్టి సునీత విష్ణు మూర్తి, శాఖా శ్రీనివాస, వైస్ ఎంపీపీ లు శాఖా శ్రీనివాస్, గున్నం భాను ప్రసాద్,ఎంపీటీసీలు ఉమ్మిదిసెట్టి వేరవేని సూర్యనారాయణ, శీలం వెంకట లక్ష్మీ, గొల్లపల్లి సోనియా, శీలం భాస్కర రావు, కోరుమిల్లి సర్పుంచ్ ఆచంట సత్య నారాయణ, విప్ పలివెల మదు, కేదర్లంక ఎంపీటీసీ యర్రంశెట్టి నాగేశ్వర రావు, వైసీపీ నాయకులు పుట్టా కృష్ణబాబు, శీలం గోవిందు, పోలిశెట్టి గణేష్, కట్టా మురళి కృష్ణ, నక్క సింహ చలం, కరెడ్ల చంటి, వైస్ ప్రెసిడెంట్ లు యర్రా వీరన్న బాబు, బొక్క రాంబాబు, అడపా వేణు బాబ్జీ, ఎంపిడిఓ రామకృష్ణ రెడ్డి, తహసిల్దార్ చిన్నారావు, ఎమ్ ఈ ఓ తాత రావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు,,అభిమానులు అధికారులు,ఉపాద్యాయులు,విద్యార్దులు,పాల్గొన్నారు.