విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
ఎల్ఐసి ఏజెంట్స్ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి.
ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షులు సుందర నీడి శ్రీనివాసరావు
అంబాజీపేట ( విశ్వం వాయిస్ ప్రతినిధి )
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్
పెడరేషన్(లియాపి)జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు అమలాపురం ఎల్ఐసి బ్రాంచ్ యూనియన్ కోశాధికారి కొల్లు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో వరుసగా నాలుగువ రోజు శుక్రవారం అంబాజీపేట ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయం ఆవరణలో ఎల్ఐసి ఏజెంట్లు ధర్నాకార్యక్రమం రెస్ట్ డే చేపట్టడం జరిగింది. గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టిన విధితమే. ఈ నిరసన కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా అమలాపురం బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షులు సుందర నీడి శ్రీనివాసరావు అంబాజీపేట ఎల్ఐసి సాటిలైట్ బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించి ఎల్ఐసి ఏజెంట్లతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు మన డిమాండ్ లు నెరవేరెవరకు ఏజెంట్లు అందరూ ఐక్యంగా ఉండాలని అన్నరు. ఇన్సూరెన్స్ భీమా రంగంలో ఐ ఆర్ డి ఐ ఏ తీసుకొస్తున్న పెనుమార్పులను వ్యతిరేకిస్తూ ఐ ఆర్ డి ఐ ఏ కి వ్యతిరేకంగా ఎల్ఐసి ఏజెంట్లు నినాదాలు తెలిపారు. పాలసీ ప్రీమియంలపై జిఎస్టి లను రద్దు చేయాలని, సిటిజన్ చాటర్ ప్రదర్శచించాలని,పాలసీ దారులకు ఇన్సూరెన్స్ సంస్థ మెరుగైన సేవలు అందించాలని,ఎజెంట్స్ కు గ్రాడ్యుటి , ఏజెంట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ఏజెంట్లు డిమాండ్ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ఇన్సూరెన్స్ సీనియర్ ఏజెంట్స్ బిఎస్ఎల్ మల్లేశ్వర రావు,మట్టపర్తి యేసుదాస్, అధికారపు వి.వి.సత్యనారాయణ, కేతా వీరా స్వామి, ఒరిగేటి బాలరాజు, మట్ట శ్రీనివాస గౌడ్, పిచ్చిక వీర్రాజు, కుసుమ వెంకటేశ్వర రావు, రొక్కాల శ్రీనివాసరావు, కడలి శ్రీనివాసరావు, కొళ్ల పద్మాజీ రావు, పెట్టా వెంకటరావు,పుచ్చకాయల వెంకటరావు,కాదంబరి కామేశ్వరరావు,యస్.ఆర్.ఆర్.దేవి, ఎల్.వి.వరలక్ష్మి,కాండ్రేగుల బాల కుమారి, నెల్లి ప్రసాద్, తదితర్లు ఈధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.