విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:
కోదండరామ అలంకరణలో ఏడువారాల వెంకన్న
-బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిర్ల
ఆత్రేయపురం: విశ్వం వాయిస్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఏడువారాల వెంకన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఆదివారం మూడవరోజు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో కొత్తపేట శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ
విప్ చిర్ల జగ్గిరెడ్డి దంపతులు పాల్గొని ,ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. వెంకన్న స్వామిని కోదండ రాముడిగా అర్చకులు, అలంకరించి ప్రత్యేక పూజలు,విశ్వక్సేన పూజ,పుణ్యాహవచనము,
పంచామృత మంటపారాధన
మాహాస్నపనం ప్రధాన హోమములు,జగత్ కళ్యాణం నిమిత్తం శ్రీనివాస కళ్యాణం,సాయంత్రం,స్వస్తి వాచనము,ప్రధాన హోమములు,విశేషార్చన,చతుర్వేద స్వస్తి,దిగ్ దేవతా బలిహారణ,రాత్రి 6:30
కోదండ రామ అలంకరణలో, హనుమద్వాహన సేవ,నీరాజన,మంత్రపుష్పములు,తీర్థ ప్రసాద వితరణ
మొదలగు కార్యక్రమములు
అత్యంత వైభవముగా జరిపించారు. అలాగే కేరళ మేళ తాళాలు వాయిద్యాలు భక్తులకు ఆకర్షనీయంగా నిలిచాయి. స్వామివారు భక్తులకు కనుల నిండుగా కనిపించి దర్శించారు. ఈ బ్రహ్మోత్సవాలను ఆలయ చైర్మన్ రమేష్ రుద్రరాజు, పాలకమండలి సభ్యులు, సత్యనారాయణ రాజు, ఆలయ సిబ్బంది ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించారు.