విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
ఎన్నికల ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఆర్బాటమే జనవాణి కార్యక్రమం అని రాజమండ్రి నగర వైసిపి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అరిఫుల్లాఖాన్ విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజలు సమస్యలు తెలుసుకొని 151 ఎమ్మెల్యేలను, 22 మంది పార్లమెంటు సభ్యులను నెగ్గించుకుని ఇచ్చిన హామీలను 95 శాతం అమలపరిచి మరే ఇతర ముఖ్యమంత్రికి సాధ్యం కానీ సంక్షేమ ప్రథాతగా ముఖ్యమంత్రి వై.యెస్ జగన్మోహన్ రెడ్డి పొందారని తెలిపారు. జనరంజకమైన పరిపాలన సాగిస్తూ కూడా ఇంకా ప్రజల ఇబ్బందులను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలను,పార్లమెంట్ సభ్యులను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించి ప్రతి సమస్య పరిష్కార దిశగా పరిపాలిస్తున్న వైసిపి ప్రభుత్వం ముందు కుప్పిగంతులు ఎందుకని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు.23 సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు 2024 లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమో అని సందిగ్ధంలో ఉండగా, పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన మీరు ప్రజల ఇబ్బందులను,సమస్యలను పరిష్కరిస్తాను అర్జీలు ఇచ్చేయండి అని చెప్తుంటే వినే వాళ్ళకి చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు పార్టీ ఎందుకు పెట్టారో తెలియదు ఒకసారి ప్రశ్నించడానికి అంటారు,మరోసారి అధికారం నాకెందుకు అంటారు మరలా మీరే జన సైనికులని సీఎం అని పిలవమంటారు అని ఎద్దేవా చేశారు. మీకు నిజంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై ప్రేమ ఉంటే వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు మద్దతు ఇచ్చి మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరాలని ఈ సందర్భంగా ఖాన్ హితవు పలికారు.