నాగభత్తుల శాంతకుమారి పంపిణీ చేశారు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
అంబాజీపేట ( విశ్వం వాయిస్ ప్రతినిధి )
గర్భిణీ స్త్రీలకు, చంటి బిడ్డ తల్లులకు పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యమని అంబాజీపేట ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు అన్నారు . అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ మెట్ల రాంజీ పేటలో అంగన్వాడి సెంటర్ ( 228 ) అంగన్వాడీ టీచర్స్ కి మంగళవారం ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, మాచవరం గ్రామపంచాయతీ సర్పంచ్ నాగాభత్తులు శాంత కుమారి చేతుల మీదుగా మండలంలో 15 అంగన్వాడి టీచర్స్ కి పంపిణీ చేయడం జరిగింది. అంగన్వాడి సూపర్వైజర్స్ రమాదేవి , మహాలక్ష్మి అధ్యక్షతన ఈకార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ కి సెల్ ఫోన్స్, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు , ప్రీ స్కూల్స్ కిట్లు , పిల్లల కోసం ఫర్నిచర్ ను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సర్పంచ్ నగబత్తుల శాంతకుమారి, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూడు సంవత్సరాల నిండిన పిల్లలను విధిగా అంగన్వాడీ స్కూల్స్లలో జాయిన్ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలకు , పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేయడంలో పెద్దపీట వేసిందని అన్నారు. చిన్ననాటినుండే ఇంగ్లీష్ విద్య బోధనతో పిల్లలకు నేర్పిస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో రాయుడు కృష్ణ మహేష్, టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నాగబత్తుల వెంకట సుబ్బారావు, ఆశలత, గోసంగి సత్యనారాయణ, నెల్లి దుర్గాప్రసాద్, కొల్లి సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.