విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:
వీరమ్మ చెరువు వాలును పునరుద్దరిస్తాం – ఒమ్మి రఘురామ్
జగ్గంపేట:విశ్వం వాయిస్ న్యూస్
జగ్గంపేట పట్టణంలో వర్షం పడితే యస్సీ పేట,పల్లపు వీధి,సంఘం ఆఫీస్ వీధి, శెట్టిబలిజ పేట, మారిశెట్టి వారి వీధి, సత్యవేణి పేట తదితర ప్రాంతాలు, కాకినాడ రోడ్ ముంపుకు గురవుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, ఈ కాలువను పునరుద్దరిస్తామని వై యస్ ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. ఈ ముంపుకు కారణం అవుతున్న వీరమ్మ చెరువును మంగళవారం ఆయన పరిశీలించడం జరిగింది. కాలువలో పేరుకుపోయిన తుప్పలు, చెట్లు,చెత్త చెదారం వలన నీటి ప్రహహానికి అడ్డంకిగా ఉన్న విషయం గమనించామని,వాటిని తొలగించడానికి, కాలవలో పూడిక తీయడానికి అవసరమైన లైన్ ఎస్టిమేట్స్ తయారు చేయమని ఇరిగేషన్ అధికారులను అదేశించడమైనది ఆయన అన్నారు. జగ్గంపేట శాసన సభ్యులు సహాయ సహకారాలతో కాలువ పునరుద్దరణతో పాటు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, అవసరమైన చోట కల్వర్టులు ఎత్తు పెంచడం జరుగుతుందని ఆయన తెలియజేసారు.