విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
ఆదిత్యలో ఘనంగా వరల్డ్ యానిమేషన్ డే
కాకినాడ సిటీ,విశ్వం వాయిస్ న్యూస్ : ఆదిత్య డిగ్రీ కళాశాలల అనుబంధ సంస్థ ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ బియస్ యానిమేషన్ విభాగం ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సూపర్టూన్ వరల్డ్ యానిమేషన్ డే ఫెస్ట్ కు ముఖ్య అతిధులుగా ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ డాఎన్. సుగుణారెడ్డి ఆదిత్య డిగ్రీ మరియు సీజ్ కళాశాలల అకాడమిక్ డైరెక్టర్ డా బి.ఇ.పి.యల్. నాయుడు చీఫ్ గెస్ట్ పీజీ సెంటర్ స్పెషల్ ఆఫీసర్ డా యమ్. కమల కుమారి మరియు డైరెక్టర్ మరియు యాక్టర్ సూర్య ఆకుండి పాల్గొన్నారని కళాశాల కళాశాల ప్రిన్సిపాల్ డి. బ్యూలా తెలియజేశారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ డా యమ్. కమలకుమారి యానిమేషన్ అనేది సైన్స్ మరియు అన్ని రంగాలలో
ఉపయోగపడుతుందని ప్రస్తుత టెక్నాలజీలలో యానిమేషన్ కూడా ముడిపడి యున్నదని ఎఆర్ వి.ఆర్. టెక్నాలజీ ద్వారా
మనకు దూరంగా యున్న వ్యక్తిని 3డి ఏనిమేషన్ ద్వారా మనకు దగ్గరగా ఉన్నట్లు చూపించవచ్చునని ప్రస్తుతం
యానిమేషన్ కోర్స్ నడపటానికి అవసరమైన ఎక్యూప్మెంట్ ను టెక్నాజీని అందించటంలో ఆదిత్య ముందు యున్నదని దీని వెనుక ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్. శేషారెడ్డి కృషి ఎంతో యున్నదని తెలియజేశారు. ఆదిత్య విద్యార్థులుచేసిన సమిష్టి కృషి ఎంతో బాగుందని అభినందించారు. అనంతరం డైరెక్టర్ డా బి.ఇ.వి.యల్. నాయుడు మాట్లాడుతూ ఆదిత్య యానిమేషన్ కోర్డుకు ఒక ప్రత్యేక గుర్తింపు యున్నదని ఆదిత్య కళాశాలలో విద్యార్థులను ఏనిమేషన్, వి ఎఫెక్ట్స్ ఫిల్స్, ఐటీ సెక్టార్ ఉద్యోగులుగా యానిమేషన్ కోర్సులు నిర్వహిస్తునామని, విద్యార్థిని విద్యార్థులలో విభీకృతమైన, ప్రజ్ఞా పాటవాలనువెలికితీయటానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని, వరల్డ్ యానిమేషన్ డే సందర్భంగా సూపర్టూన్ వరల్డ్ ఏనిమేషన్ డే సదస్సు నిర్వహించామని తెలియజేశారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అన్ని ఇంటర్ మరియు డిగ్రీ కళాశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. సూర్య ఆకుండి మాట్లాడుతూ తన అభివృద్ధికి, తాను ఎదగడానికి యానిమేషన్ ఉపయోగపడిందని అదేవిధంగా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఇటువంటి కోర్సును మన ఆదిత్యాలో అందరికి అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందకరమని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డి. బ్యూలా మాట్లాడుతూ బియస్సీ యానిమేషన్ అనేది 18వ శతాబ్దంనుండి యున్నదని అది కాలానుగుణంగా అభివృద్ధి చెంది నీ యఫీ యర్డ్, 3డ్ యానిమేషన్ 2డి యానిమేషన్ విభాగంలో జరిగిందని తెలియజేశారు. నేటి పోటీ ప్రపంచంలో ఆధునిక పరిజ్ఞానంలో వస్తున్న మారులలో విజువల్ ఎఫెక్ట్ యానిమేషన్ 35, 25, గేమ్ డిజైనింగ్, ఫిల్మ్ మేకింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ వంటి కొత్త కోర్టుల పట్ల విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా వారిలో యున్న సామర్థ్యాలను, సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈవెంట్ ను . నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ తరం యానిమేషన్ విద్యార్థులదేనిని ఇటువంటి డిజైనింగ్ మరియు కాంపిటేటివ్ఈవెంట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. ఈ ఈవెంట్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డ్రాఫ్ట్ వర్కు, మీమ్స్ మేకింగ్, స్ప్రూస్ మేకింగ్, గ్రీన్మెట్, రిమూనింగ్, ఇమేజ్ టు కెడీ, ప్లాప్మిట్ వంటి పోటీలను నిర్వహించామని ప్రతిభ కనబరచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు ముఖ్య అతిధులు చేతులు మీదుగా ఇప్పటం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డి. బ్యూలా తెలియజేశారు. ఈ సదస్సు నిర్వహించిన ఏనిమేషన్ విభాగాన్ని ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ ఎన్. శేషారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. సత్య ఏనిమేషన్ హెచ్.ఓ.డి. యమ్. చంద్రశేఖర్ మరియు యన్. సత్య సతీష్ విద్యార్థులు పాల్గోన్నారు.