విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
*స్పందించిన సీఎం మృతుడి కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం*
*బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని*
*అధికారులకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం*
విశ్వం వాయిస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్టాప్ ప్రతినిధి
*డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మడివరం
నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు కరెంట్ షాక్ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి చెంది వెంటనే స్పందించి
విద్యుత్ షాక్ తో చనిపోయిన బాలుని కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు చికిత్స పొందుతున్న విద్యార్థులకు లక్షల రూపాయలు పరిహారం ప్రకటించి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బాధిత కుటుంబాలకు అధికారులు తోడుగా నిలవాలని ఆదేశించారు