విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ఇద్దరు మహిళల హత్యకు పధకం పన్నిన హత్యకేసు నిందితుడిపై కేసునమోదు..
గతంలో తమ్ముడు రామకృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడు వేండ్రపు శ్రీనివాస ప్రసాద్..
తమ్ముడు హత్యకు గురికావడంతో అనారోగ్యంతో ఉన్న తల్లిని సాకుతున్న అక్కా ,చెల్లెళ్ళు..
చెల్లెలు, పిన్నిని హతమార్చేందుకు రెండులక్షల రూపాయలతో సుపారీ..
సుపారీ తీసుకున్న వ్యక్తి దార్ల ఏసురాజు ఇచ్చిన సమాచారంతో అతనిని, వేండ్రపు శ్రీనివాస ప్రసాద్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు..
2019 డిసెంబరు 8వ తేదీన హనీట్రాప్ ద్వారా హత్యకు గురి అయిన వేండ్రపు రామకృష్ణ హత్యకేసులో ప్రధాన నిందితుడు వేండ్రపు శ్రీనివాస ప్రసాద్..
రామకృష్ణ మిస్సింగ్ అయిన ఆరునెలల వరకూ మందకొడిగా సాగిన దర్యాప్తు..
మృతుడు రామకృష్ణ సోదరి హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేయడంతో దర్యాప్తు వేగవంతం చేసి రామకృష్ణ హత్యకు గురి అయినట్లు,..
ప్రధాన నిందితుడు అతని సోదరుడు వాండ్రపు శ్రీనివాస ప్రసాదుగా గుర్తించిన పోలీసులు..
ఇప్పుడు పాత కక్షల నేపథ్యంలో శ్రీనివాస ప్రసాదు తన పిన్ని, చెల్లెలును హత్యచేసేందుకు దార్ల ఏసురాజుతో రెండు లక్షల రూపాయలకు ఒప్పందం..
భయంతో ఏసురాజు మృతడి సోదరికి ఫోనుచేసి చెప్పిన ఏసురాజు.. ఏసురాజును పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్దానికులు..
శ్రీనివాస ప్రసాదు, ఏసురాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
తమ అన్న శ్రీనివాస ప్రసాద్ నుండి తమకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్న మహిళలు…