– ఎ పి కు జరుగుతున్న అన్యాయం పై ప్రధాని కి చెప్పలేక పోవటానికి గల కారణం ఏమిటి.
ప్రధాని మోది సభకు వైఎస్సార్ సిపి ప్రజలను తరలించటం విడ్డూరం.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
పవన్ కళ్యాణ్ తో ప్రధాని భేటీ మందలింపుకేనా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్త పరిచారు.ఒక ప్రధానమంత్రి స్థాయిలో నరెంద్రమోది ఆంధ్రప్రదేశ్ లో గల విశాఖపట్నం విచ్చేసి అన్యాయమై పోతున్న ఆంధ్రుల భవిష్యత్ కు ఏ ఒక్క భరోసా ఇవ్వకపోవటం సిగ్గుమాలిన చర్యగా భావించాలని, ప్రధాని విశాఖ ఎందుకొచ్చినట్లో సామాన్యులకు, మేధావులకు అర్ధం కావటం లేదని, ప్రధాని ఉపన్యాసంలో ఆంధ్రులు ప్రతిభ ప్రపంచ స్థాయిలో చాటుతున్నారని ప్రధాని చెప్పటంలో అర్ధం లేదని, ఆంధ్రులు ప్రపంచానికి మార్గదర్శకులుగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి అవకాశాలు లేకుండా పోయిందని, అభివృద్ధి అంతరించి పోతుందని, భవిష్యత్ ప్రమాదకరంగా వుందని ప్రధాని గ్రహించక పోవటం భాదాకరని, ఎనలేని అపార సంపద గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, మన రాష్ట్రంలో మెజార్టీ సంపదను గుజరాత్ సంపన్నులు దోచుకుపోతున్నారని,ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక మైన మేలు చేయకపోయినా రాష్ట్రానికి రావలిసిన హక్కులకు భరోసా ఇవ్వకపోవటం దురదృష్టం అని, మన రాష్ట్రంలో ఓడరేవులు, సహజ వనరులను, ప్రధాని స్వరాష్ర్టీయలు దోచుకుపోతున్నా ఆంధ్రులకు న్యాయం చేయకపోవడం ప్రధానికి తగదని, ఆంధ్రులపై ప్రధాని వివక్ష చూపటం సామాజిక ద్రోహంగా పరిగణించాలని, ఆంధ్రప్రదేశ్ కోసం
ఏ ఒక్క హామీని విశాఖపట్నం సభలో ప్రధానమంత్రి ప్రకటించకపోవడం క్షమించరాని నేరం అని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.
ఆంధ్రప్రదేశ్ లో బిజెపి నేతలు ఎందుకున్నట్టని, విశాఖ ప్రధాని సభలో రాష్ట్ర సమస్యలను వివరించలేని వెన్నుముక లేని నేతలను రాష్ట్ర ప్రజలు మోయటం హేయమైన చర్య అని, బిజెపి అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లోగల సమస్యల పట్ల కాకుండా రాజకీయ ప్రయోజనాలకు చెక్క భజన చేసేటోళ్లను ఎంపిక చేసి రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని, మన రాష్ట్రంలో వున్న అసమర్థ బిజెపి నేతలు మరే రాష్ట్రంలోను వుండరని, కొంతసేపు జగన్ ను విమర్శిస్తున్నట్టు, మరోసారి చంద్రబాబు ను విమర్శిస్తున్నట్టు తోలుబొమ్మల నాటకాన్ని రక్తి కట్టిస్తు ప్రజల ద్రుష్టి మళ్లించే విధంగా రాజకీయ పబ్బం గడుపు కుంటున్నారని,ఏపిలో అధికార, విపక్షం సైతం మోది సర్కార్ కు తలూపుతుంతుంటే, బిజెపి పెద్దలు మాత్రం గోడమీద పిల్లి పాత్రలు పోషిస్తున్నారని, మోది క్షుద్ర రాజకీయంతో ఏపిలో ఎదురు లేకుండా జగన్, చంద్రబాబు లను బానిసలుగా మార్చుకున్నారని,
ఈ దళారి పార్టీలను ఇంకను ఆంధ్రులు అనుసరించటం ఎవరి భవిష్యత్ ను వారు కోల్పోవటం వంటిదని,కార్పోరేట్ శక్తులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను ఆస్తి పంజరంగా మారుస్తున్నా ఆంధ్రప్రదేశ్ లోగల ప్రధాన రాజకీయ పక్షాలు నిమ్మకు నీరెత్తి నట్లు చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షంతో విపక్షాలు వాగ్వివాదాలు చేసుకుంటు ప్రజలను ద్రుష్టి మళ్లించే నాటకాలుతో రాష్ట్ర ప్రజలను నమ్మిచే ప్రయత్నాలు చేయుటం,ఢిల్లీ లో ఆంధ్ర లోగల స్వపక్ష, విపక్షాలు మోదికి బాంచన్ దొర అంటు కాళ్లు మ్రొక్కటం చూస్తుంటే వీరికన్నా నర్తనశాలలు ఎంతో మేలని, విశాఖ సభలో ప్రధాని మోది నోచ్చు కోకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారని, రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదు మోది వద్ద మాత్రం మార్కులు వేయించుకోవాలనే ఉద్దేశ్యంతో జగన్ అత్యంత క్రమశిక్షణ పాటించారని, ప్రధానికి ఆంధ్రుల ఆవేదన తెలియకూడదనే ఉద్దేశ్యంతో అనువాడికుడు లేకుండానే జగన్ తెలుగులో ఉపన్యాసం కొనసాగించారని, ప్రత్యేక హోదా, విభజన హామీలు,స్టీల్ ప్లాంట్, రైల్వే డివిజన్ తో కూడిన జోన్ ఊసే లేకుండా ముఖ్యమంత్రి ఉపన్యాసం కొనసాగించటం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని బలి పెట్టినట్టేనని, విశాఖ సభ మొత్తం ప్రధానికి కితాబులివ్వటమే పనిగా జగన్మోహన్ రెడ్డి బట్రాజు పాత్ర పోషించి రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారని, రాష్ట్ర సమస్యలు ప్రధానికి విన్నవించక పోగా ఉపన్యాసంలో సైతం ఏకరువు పెట్టకపోవడాన్ని ఏమంటారని,
వీరి స్వార్ధప్రయోజనాలకోసం, ఏ పి ప్రతిష్ట ను అమ్మేయటం ఎంత వరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.ఏపి బిజెపి పెద్దలకు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కాలేకపోవటం అవమానం అనిపించటం లేదాఅని , ఏపి బిజెపి అధ్యక్షులు సోము ను ఉద్దేశించి
“ఆప్ కా నామ్ క్యాహై” అని ప్రధాని సంబోదించటం అత్యంత అవమానంగా భావించాలని, సోము అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రధానికి విన్నవించాం అని చెప్పిన మాటలు అన్ని అబద్దాలు అని నిరూపించబడ్డాయని, పైగా సోము ఏమిచేస్తుంటారో ప్రధానికి వివరించలేక పోయారని,ఏ వ్యాపారం లేకపోయినా కోట్లు ఎలా సంపాదించారో ఆ భగవంతుడుకే తెలియాలని, పైగా సోము ఆంధ్రప్రదేశ్ లో గల జిల్లాల సంఖ్య చెప్పలేక పోవటం చూస్తుంటే ఆ పార్టి నుండి సోము బాధ్యతలు వేరెవరికైనా బదలాయించి పరువును కాపాడుకోవటం ఉత్తమమని, పవన్ కళ్యాణ్ తో మోది భేటీ సారాంశం అంత వైఎస్సార్ సిపి పార్టి తో సఖ్యతగా వుండమని సూచించినట్టుగా వుందని, జగన్ ను నేరుగా టార్గెట్ చేస్తు విమర్శలు మనుకోమని సుతిమెత్తగా మందలించి నట్టు వుందని ఆయన పేర్కొన్నారు.
విశాఖ సభ మొత్తం జగన్ పార్టి కనుసైగలో నడిచిందని, ఏపి బిజెపికి కనీస ప్రాధాన్యత లేకపోవటం సిగ్గు చేటని, ప్రధాని సభకు మొత్తం ప్రజలను తరలించిన ఘనత జగన్ పార్టీదే నని,విశాఖలో ప్రధాని పర్యటన ద్వారా జగన్ కు కేంద్రం లో మంచి పట్టు వుందని నిరూపించుకున్నారని,ప్రధాని సభ సాక్షిగా ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కు అవమానం తప్పలేదని, పవన్ కళ్యాణ్ బిజెపి ని వదిలి ఆంధ్రప్రదేశ్ సమస్యలు, హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న రాజకీయ పార్టీలతో కలసి రావాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన కోరారు.సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, లంక దుర్గాప్రసాద్, ఎండి హుస్సేన్ , వర్ధనపు శరత్ కుమార్, సిమ్మా దుర్గారావు , కొల్లి సత్యనారాయణ ,వనుం శ్రీనివాసరావు, బత్తెన రమణ , మండవల్లి శంకర్, మండవల్లి సూరిబాబు , మాసా అప్పాయమ్మ, నాగూరి అన్నపూర్ణ ,కోట సుశీల ,కంచెర్ల సత్యవతి , మద్దా ప్రశాంతి , పిల్లా వెంకట రమణ , దాసరి కోట లక్ష్మి , బాసి వేణు ,బొంతు అనంతలక్ష్మి ,అడపా శేషగిరి,తదితరులు పాల్గొనియున్నారు.