బాలల దినోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రం ప్రాంగణంలోని కళా వేదికపై జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు , పాలు స్కూల్స్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొననున్నారని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి కె. విజయ కుమారి తెలిపారు. పలు జాతీయ స్ఫూర్తి కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియచేశారు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం రూరల్:
సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ మాధవీలత తెలిపారు.ప్రతివారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలియచేశారు.
ఆనం కళా కేంద్రంలో బాలల దినోత్సవం :