– జగన్ పాలనలో అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు
– జగన్ పాలనలో పేద ప్రజలు ఆనందోత్సవాలు
– గ్రాఫిక్స్ నగరాలు కాదు….పేద ప్రజల నగరాలు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కడియం రూరల్:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులు చూసి వారు లేకే ప్రతిపక్షాల నాయకులు విమర్శిస్తున్నా రని రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పేర్కొన్నారు.మంగళవారం ఉదయం స్థానిక కడియం మండలం జేగురుపాడు గ్రామంలో నిర్మిస్తున్న జగనన్న కాలని లో నిర్మిస్తున్న ఇళ్లను స్థానిక ప్రజలు మరియు నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, సినిమా హీరో, కృష్ణ కుమారుడు మహేష్ బాబు కు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.జనసేన నాయకులు ప్రతిపక్షాలు జగనన్న కాలనీలను చూసి ఓర్వే లేక దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ధైర్యంగా 30 లక్షల పైగా ఇళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మాణాలు జరగడం లేదని అన్నారు. జేగుడుపాడు గ్రామంలో పాములు మెట్టుగా పేరుపొందిన ఈ ప్రాంతంలో రెండు వేలకు పైగా ఇల్లు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో పేద ప్రజలు ఆనందంతో ఉన్నారని అన్నారు. జగనన్న నిర్మిస్తున్న కాలనీలలో విద్యుత్ సౌకర్యంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు మంచినీటి సౌకర్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.అమరావతి నగరాలు గా గ్రాఫిక్స్ కాదు అని, ఈవి పేద ప్రజలు కలలు నిజం చేస్తున్నా ప్రజా నగరాలు అని చందన నాగేశ్వర్ పేర్కొన్నారు.జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల మా సొంత ఇంటి కలలు నిజం అయ్యాయని, సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మా ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, కడియం మండల అధ్యక్షులు జేగురుపాడు సర్పంచ్ యాధల సతీష్ చంద్ర స్టాలిన్, దేవంగా కార్పోరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి వీరభద్రయ్య, మండల బూత్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, మండలి వ్యవసాయ ఛైర్మన్ ఉప సర్పంచ్ తోకాల శ్రీనివాస్ ,ఎంపీటీసీ ఆకుల సుధాకర్, మాజి ఎంపిటిసి నాగిరెడ్డి శివాజీ, ఫిషర్ మెన్ సొసైటీ బల్ల అన్నవరం, కడియపులంక సొసైటీ తిరుమల శెట్టి శ్రీను,కొత్తపల్లి వెంకన్న,బోడపాటి సత్యనారాయణ, సాపిరెడ్డి కామేష్,బత్తుల రాము,ఈలి శ్రీను మరిశెట్టి నాగన్న, తులురి సుబ్బారావు,అరెటి వెంకట్రావు,గండి రమణ, అయినవిల్లి పపాజి, గంగరావు చౌదరి, కుపాక రమణ, ఆచంట కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.