విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:
:స్థానిక యర్నగూడెం హైవే పై కృష్ణంపాలెం సమీపంలో గురువారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సైకిల్ పై వెళుతున్న సుమారు 50 సం” వయస్సుగల గుర్తు తెలియని మగ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మృతి చెందడం జరిగింది.తదుపరి అనేక వాహనాలు మృతదేహంపై నుండి వెళ్లడంతో శరీరం పూర్తిగా చిద్రమై గుర్తు పట్టలేని స్థితిలో భయానకంగా తయారయ్యింది.ఈ నేపథ్యంలో సదరు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని,లభించిన ఆధారాల ప్రకారం మృతుని ఆచూకీ వివరాలు ఎవరికయినా తెలిసిన ఎడల వెంటనే సంబంధిత దేవరపల్లి పోలీస్ స్టేషన్ కు ఫోన్ 08813-273533,9440796624 ద్వారా తెలియజేయాలని ఎస్సై కె.శ్రీహరిరావు తెలియజేస్తున్నారు.