విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:
దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో ఆదివారం జడ్పీ హైస్కూల్ వద్ద ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు ఓటుకు సంబంధిత పక్రియ కొనసాగింది.ఈ సందర్భంగా మాజీ దేవరపల్లి మండల ప్రజా పరిషత్ అద్యక్షులు గద్దే వెంకట రామారావు ఓటర్ గుర్తింపు కార్డ్ తో ఆధార్ అనుసంధానాన్ని ఓటర్ నమోదు శిబిరంలో నమోదు చేసుకొన్నారు.ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థ అత్యంత కీలకమైనదని 18 సంవత్సరములు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.అదేవిధంగా ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల ప్రకారం,వారు అడిగిన గుర్తింపు పత్రాలు ప్రతీ ఓటరూ సమర్పించి ఆధార్ కార్డ్ తో ఓటర్ కార్డ్ ని అనుసంధానం చేయు ప్రక్రియను పూర్తి చేయించుకుని తగిన అర్హత సాధించుకోవాలని రామారావు సూచించారు.