విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*గర్జిస్తూ కదం తొక్కిన మాదిగ ,మాదిగ ఉప కులాలు*
*మాదిగల మనుగడ లేదన్న వారికి మేమున్నామని నిరూపించారు*
అమలాపురం డిసెంబర్ 11 విష్ణు వాయిస్
డా: బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం కొంకాపల్లి వద్ద మాదిగ మాదిగ ఉపకులాల పొలిటికల్ జేఏసీ నాయకులు బొమ్మి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జరిగే మాదిగ, మాదిగ ఉపకులాల రాజకీయ చైతన్య మహాసభకు జిల్లా నలుమూలల నుంచి మాదిగలు, ఉప కులాల వారు భారీ సంఖ్యలో రాజకీయ చైతన్య మహాసభకు చేరుకున్నారు. ఈ మహాసభకు ఇతర సామాజిక వర్గాల నాయకులు ఉమ్మడి రాష్ట్రాల శెట్టి బలిజ జేఏసీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణ, కాపు నాయకులు కల్వకొల్లు తాతాజీ వాసంశెట్టి సుభాష్, భారతీయ జనతా పార్టీ నాయకులు మోకా సుబ్బారావు పాల్గొనగా ముఖ్యఅతిథిగా బాపట్ల వైయస్సార్సీపి ఎంపీ నందిగం సురేష్ విచ్చేశారు ఈ సందర్భంగా ఎంపి ప్రసంగిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగల మునుగడ లేదన్న వారికి మాదిగలు ఉపకులాల వారు భారీ సంఖ్యలో మహాసభకు విచ్చేసి నిరూపించారని మాదిగ మాదిగ ఉప కులాలరాజకీయ చైతన్య కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ దృష్టికి తీసుకు వెళ్తానని సభలో వారు తెలియజేశారు. రాజకీయ చైతన్య మహాసభకు జరుపుకునేందుకు అన్ని అనుమతులు తీసుకున్న మహాసభకు బైకులపై ముగ్గురు చొప్పున చేరుకునే మాదిగ కార్యకర్తలను పోలీసులు ఆపడంతో మాదిగ మాదిగ ఉప కులాల పొలిటికల్ జేఏసీ నాయకులు మహాసభ ప్రాంగణం నుంచి ఎన్హెచ్ రోడ్డుపై కి వచ్చి బైఠాయించి నిరసన తెలియజేశారు సీఐ కొండలరావు వారిని వారించి శాంతింప చేయడంతో నిరసన సద్దుమణిగింది.