– మృతుడు ,డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం,సత్యనారాయణ
విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి సిటీ:
ఎమ్మెల్సీ అనంతబాబు నుంచి మాకు ప్రాణహాని ఉంది
– మా కుటుంభానికి రక్షణ కల్పించండి
– మృతుడు ,డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం,సత్యనారాయణ
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్ :
ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రావడంపై మృతుడు, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వీధి నూకరత్నం, సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.అనంతబాబు నుంచి తమకు ప్రాణహాని ఉందని,తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు రావుతో కలిసి వారు మాట్లాడుతూ నా కొడుకును తిరిగి తీసుకు రాగలరా అని ప్రశ్నించారు.తమ కుమారుడు హత్యపై సి.బి.ఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.అనంతబాబు మనుషులు ఎక్కడికక్కడే ఉన్నారని వారి నుంచి తమను కాపాడాలని కోరారు.ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రావడంపై ఎ.పి పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు, న్యాయవాది
ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ
ప్రభుత్వ సహకారం,పోలీసుల నిర్లక్ష్యం వల్లే అనంతబాబుకు బెయిల్ వచ్చిందని విమర్శించారు.వై.సి.పి ప్రభుత్వం దిశ చట్టం అంటూ ప్రచారం చేస్తోందని,కాని
210 రోజులైనా దళిత యువకుడు హత్య కేసులో విచారణ పూర్తి చేయలేదని మండిపడ్డారు.తమ న్యాయపోరాటం వల్లే ఏడు నెలలుగా అనంతబాబు జైళ్లో ఉన్నాడని,
అనంతబాబుకు శిక్షపడేవరకూ సుబ్రహ్మణ్యం కుటుంబానికి దళిత, ప్రజా సంఘాలు అండగా ఉంటాయన్నారు.స్పెషల్ బెటాలియన్ ద్వారా సుబ్రహ్మణ్యం కుటుంబానికి పోలీసులు రక్షణ ఇవ్వాలని కోరారు.డి.జి.పి జోక్యం చేసుకుని హత్య కేసు విచారణ పూర్తి చెయ్యాలని, సిబిఐ విచారణకు ఆదేశించాలని సూచించారు.
అనంతబాబు విడుదలైతే భారీ ర్యాలీకి సన్నాహాలు చేసుకోవడం సిగ్గుచేటని
ముప్పాళ్ల సుబ్బారావు విమర్శించారు.విలేకర్ల సమావేశంలో మృతుడు సుబ్రహ్మణ్యం సోదరుడు నవీన్ ప్రజా సంఘాల నాయకులు ఇసుక పట్ల రాంబాబు,పిట్టా వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యం తల్లి వీధినూకరత్నం ఆవేదన:
ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రావడంపై మీడియా ముందుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ,అనంతబాబుకు బెయిల్ ఇచ్చారు మాకు ప్రాణభయం ఉంది ,
అనంతబాబు నుంచి మాకు రక్షణ కావాలి ,
నా కొడుకును తిరిగి తీసుకు రాగలరా,
మా కుమారుడు హత్యపై సి.బి.ఐ విచారణ జరగాలి,అనంతబాబు మనుషులు ఎక్కడికక్కడే ఉన్నారు.