విశ్వంవాయిస్ న్యూస్, పి గన్నవరం:
ఇదేం కర్మ వ్యాపారస్తులకు బాదుడే బాదుడు
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్మిక,కర్షక, వ్యాపారఅన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి ఆరోపించారుఈ మేరకు ఆమె పి.గన్నవరంమూడు రోడ్ల కూడలిలో తెలుగుదేశం పార్టీవాణిజ్య విభాగంఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మ వ్యాపారులకు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పి. గన్నవరం సెంటర్లోని దుకాణాల వద్దకు ఆమె టిడిపి నాయకులతో కలిసి తిరుగుతూ వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మండలంలోని లంకల గన్నవరం గ్రామం జోన్నల్లంక వద్ద టిడిపి గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు లంకే చిరంజీవి, వేమన రామకృష్ణ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో రెడ్డి అనంత కుమారి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిలు నామన రాంబాబు, డొక్కా నాధ్ బాబు, నియోజకవర్గ టిడిపి పరిశీలకుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాల రాయుడు పాల్గొని మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో అరాచక పారాయణ సాగిస్తున్న సైకో వైకాపా ప్రభుత్వాన్ని గద్దించెందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు చేరవేయడమే ఇదేం కర్మ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ప్రజల కష్టసుఖాలలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తోడు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు, పి. గన్నవరం సర్పంచ్ బొండాడ నాగమణి, ఎంపీటీసీ అవనిగడ్డ సత్తిబాబు, వైస్ ఎంపీపీ నేలపూడి దామోదర్, టిడిపి నాయకులు తోలేటి సత్తిబాబు, మోకా ఆనందసాగర్, సంసాని పెద్దిరాజు, మట్టపర్తి రామకృష్ణ, బోనం బాబు, గంధం భాస్కరరావు, బోళ్ళ వెంకటరమణ, నాగబత్తుల వెంకటసుబ్బారావు,సూద బాబ్జి,నక్క సునీల్ రాజు, పడాల సూపర్, మందపాటి కిరణ్ కుమార్, ముచ్చర్ల సాయిబాబు, గోగి రమేష్, పులపర్తి రవికుమార్, చుట్టగుల్ల కిషోర్, యాండ్ర శ్రీను, శేరు శ్రీను, వక్కలంక బుల్లియ్య, తదితరులు పాల్గొన్నారు.