రావులపాలెం లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం
రక్తదానం చేసిన ప్రభుత్వ విప్ చిర్ల మరియు జగనన్న అభిమానులు
విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
కొత్తపేట నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరంలో రక్త దానం చేసిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మరియు అభిమానులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వివిధ సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమాంధ్రప్రదేశ్ గా మార్చిన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని ప్రజలందరూ సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ వేడుకల మాదిరి స్వచ్చందంగా జరుపుకుంటున్నారని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా రావులపాలెం ప్రభుత్వ కళాశాలల మైదానం దగ్గరలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది అని శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి స్వయంగా రక్తదానం చేయగా ఆయనతో పాటూ 56 మంది రక్తాన్ని స్వచ్చందంగా దానం చేశారు, అలాగే ఒకేసారి ఎక్కువ మంది రక్తం దానం చేస్తే నిల్వ చేయడం ఇబ్బంది అవుతుంది అని వినూత్నంగా రక్తం అవసరం అయినప్పుడు ఇస్తామని హామీ తీసుకోగా స్పందించిన అభిమానులు సుమారు 645 మంది రక్తం భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఇస్తామని హామీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేకును చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు కొప్పన శివ మరియు నియోజకవర్గ నాయకులతో కలిసి కట్ చేసి అభిమానులకు, మహిళలకు పంచి శుభాకాంక్షలు తెలియచేసారు.
అనంతరం ఈ నెల 19 వ తేదీన నియోజకవర్గంలోని 4 మండల కేంద్రాలలో మహిళలకు నిర్వహించిన రంగవల్లులు పోటీలలో ప్రధమ స్థానం సాధించిన 4 గురికి ఎల్సిడి టీవీలు, ద్వితీయ స్థానం సాధించిన 4 గురికి గ్రైండర్లు, తృతీయ స్థానం సాధించిన 4 గురికి మిక్సీలు బహుమతులుగా అందచేశారు అలాగే రంగవల్లులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ సుమారు 200 హాండ్ బ్యాగులు అందచేశారు.
ఈ సందర్భంగా ఇదేరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కొత్తపేట నియోజకవర్గ వై.యస్.ఆర్.సి.పి.నాయకులు సోషల్ మీడియా కో కన్వీనర్ గూడపాటి ప్రవీణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.
అనంతరం చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ అలాగే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన అందరికీ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన రాజమండ్రి సంజీవని బ్లడ్ బాంక్ వారికి, అమలాపురం ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బాంక్ వారికి మరియు ఊబలంక, గోపాలపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులకు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేసారు.