డిక్కీ జోనల్ మేనేజర్, ఎంఎస్‌ఎంఇ సలహదారులు ఎ జార్జిబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇచ్చే ప్రోత్సాహంలో 25శాతం ఎంఎస్‌ఎంఇలకు అందిస్తుందని తెలిపారు. క్లస్టర్ డెవలెప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 5,6 క్లస్టర్‌లను ప్రోత్సహించిందని తెలిపారు. దీని ద్వారా అనేక మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుకున్నారన్నారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం ద్వారా వారే పది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రోత్సాహకాలు, అవకాశాలను అందిపుచ్చుకుని యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఎంఎస్‌ఎంఇ డెవలప్‌మెంట్ అడ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ విశాఖ పట్నం ఆధ్వర్యంలో స్థానిక రివర్‌బే హోటల్ ఆహ్వానంలో రెండు రోజులు పాటు నిర్వహిస్తున్న వెండర్ డెవలప్‌మెంట్, అమ్మకందారు, కొనుగోలు దారులు ఇంట్రాక్షన్ మీట్ బుధవారం ప్రారంభమయ్యింది. డిక్కీ, మార్పు సంస్థల ఆధ్వర్యంలో ఓఎన్‌జిసి, గెయిల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఆర్‌ఐఎన్‌ఎల్, హెచ్‌ఎస్‌ఎల్‌ల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఇ డిఎఫ్‌వో హైదరాబాద్ అడిషనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ డి చంద్రశేఖర్, ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ సురేష్‌ప్రభు, యుబిఐ రీజనల్ హెడ్, డిజిఎం పి కృష్ణయ్య, ఓఐఎల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ ఎంవివిఎస్ మూర్తి, గెయిల్ జిఎం వైఎ కుమార్, ఓఎన్‌జిని ఛీఫ్ జనరల్ మేనేజర్ పళని కుమార్, ఎంఎస్‌ఎంఇ డిఎఫ్‌ఒ విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌చార్చి జి వి నాయుడులు అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ అమ్మకందారులు, కొనుగోలుదారులకు ఒక వేదికను ఏర్పరచి, వారి ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించే లక్ష్యంతో ఈ రెండురోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉత్పత్తి దారులు ఏవిధమైన నాణ్యతతో తమ ఉత్పత్తులు తీసుకువస్తున్నది ఈ వేదిక ద్వారా తెలియజేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. బ్యాంకర్‌లు కూడా ఈ మీట్‌కు హాజరై ఏతరహా పరిశ్రమలకు ఎంతవరకు రుణాలు అందజేస్తారు. ఎంతవరకు సబ్సిడీ ప్రోత్సహం లభిస్తుందన్న వివరాలను తెలియజేస్తాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకొనే వారు ఈ సదస్సుకు హాజరు కావడం ద్వారా తమ ఆలోచనలను పంచుకోవచ్చని, తమ ప్రాజెక్టు రిపోర్టులను బ్యాంకర్‌లకు సమర్పించి, రుణసదుపాయం పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఎంఎస్‌ఎంఇల ద్వారా ఈ రెండేళ్ళలో అనేక మందిని పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించడం జరిగిందన్నారు. పారిశ్రామికంగా కేంద్రప్రభుత్వం అనేక పాలసీలను తీసుకువచ్చిందని, ఏ పాలసీ ద్వారా తాము ఎంచుకకొనే పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందో ఈ సదస్సుకు హాజరుకావడం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. మేక్ ఇండియా, లోకల్ ఫర్ ఓకల్ వంటి నినాదాలతో పారిశ్రామిక రంగానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని తెలిపారు. డిక్కీ జోనల్ మేనేజర్, ఎంఎస్‌ఎంఇ సలహదారులు ఎ జార్జిబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇచ్చే ప్రోత్సాహంలో 25శాతం ఎంఎస్‌ఎంఇలకు అందిస్తుందని తెలిపారు. క్లస్టర్ డెవలెప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 5,6 క్లస్టర్‌లను ప్రోత్సహించిందని తెలిపారు. దీని ద్వారా అనేక మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుకున్నారన్నారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం ద్వారా వారే పది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మీట్‌కు కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి జిల్లాల నుండి మరింత మంది యువత హాజరైతే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు విక్రయదారులు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను అతిధులు చేతుల మీదుగా ప్రారంభించారు.ఫుడ్,గార్మెంట్స్, నిర్మాణ రంగానికి సంబంధించి పలుస్టాల్స్ ఏర్పాటుచేశారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికులు పాల్గొన్నారు.