విశ్వంవాయిస్ న్యూస్, ఉప్పలగుప్తం:
*పూడికతీత ,మురికి కాలవ గట్ల పటిష్టతకు ప్రతిపాదన*
*ద్విచక్ర వాహనంపై ప్రయాణించి సముద్రంలో కలిసే చోట పరిశీలించిన*
*రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్*,
*రెవిన్యూ డివిజినల్ అధికారి వసంత రాయుడు*
ఉప్పలగుప్తం డిసెంబరు 23 విశ్వం వాయిస్:
మేజర్ మీడియం మైనర్ డ్రైన్లు సముద్రం లో కలిసే చోట పూడిక తీత పనుల కు, డ్రైన్ గట్ల బలోపేతం చేసే పనులకు ప్రతిపాదనలు రూపొం దించి ఆమోదం పొందుతూ మార్చి 31 నాటికి ఆయా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా లు డ్రైనేజీ విభాగ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ మరియు రెవిన్యూ డివిజనల్ అధికారి వసంతరాయుడితో కలిసి ద్విచక్ర వాహనాలపై వారు పర్యటిం చి మండల పరిధిలోని కూనవరం- గచ్చకాయ లపొర వరకు ఉన్న మేజర్ మురుగు నీటి కాలువల స్థితిగతులను సముద్రంలో కలిసే చోట పరిశీలించి పూడికతీత మురికి కాలువ గట్లు పటిష్టతకు ప్రతిపాదన రూపొందించి సమర్పించాలని పూడికతీతకు డ్రిడ్జింగ్ విధానం ద్వారా పూడికతీత కొరకు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రంగరాజు కోడ్ మీడియం డ్రైన్ 6.2 కిలోమీటర్లు మేర పూడికను సముద్రంలో కలిసే చోట కాలువలు మురుగు కాలువ గట్ల స్థితిగతు లనుపరిశీలించారు . అనంతరం కూనవరం- ఉప్పలగు ప్తం మైనరు డ్రెయిన్ సందర్శించి ఉప్పునీరు పొలాల్లోకి రాకుండా రెగ్యులేటర్ను ఏర్పాటు చేసి నియంత్రించాలని రైతుల కోరిక మేరకు మురికి కాలువ పూడికతీత, గట్లు పటిష్టతకు పూడికతీత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవి ధంగా ఉత్తర పికిలేరు-దక్షిణ పికి లేరు డ్రైన్ కూనవరం వద్ద సముద్రం లో కలిసే చోట మురుగు కాలువలు, గట్ల స్థితిగతులను వారు పరిశీలించారు. స్థానికంగా కూడా ఉప్పునీరు పంట పొలాల్లోకి రాకుండా ప్రతిపాదనలు సిద్ధించే యాలని డ్రైనేజీ ఇంజనీర్లు ఆదేశించారు. రానున్న ఖరీఫ్ సీజన్ నాటికి డ్రైనేజీ సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన చర్యలు గైకొని రైతాంగానికి అండగా నిలవాలని వారు ఇంజనీర్లు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డ్రైనేజీ శాఖ కార్యని ర్వాహక ఇంజనీర్ కే సుబ్బయ్య , సెంట్రల్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ డివి రామగోపాల్ , ఇరిగే sషన్ శాఖ డిఇ బి శ్రీనివాసరావు డ్రైనేజీ శాఖ డీఈ ఎంవివి కిషోర్, సహాయ ఇంజనీర్ కే సునీత తాసిల్దార్ వెంకటేశ్వరి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.