రొయ్యల చెరువులుగా మార్చేస్తున్న భూస్వాములు…
విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
ఆక్వా భూతం పచ్చని పొలాలను నాశనం చేసేస్తోంది..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గo, రావులపాలెం మండలంలో కోనసీమ అందాలకు ప్రతీక. కోనసీమ ముఖద్వారం, మండల పరిధిలో పంట పొలాల్లో చేపల చెరువుల పేరుతో 20 ఎకరాలకు పర్మి షన్ తెచ్చుకున్నామంటూ చెప్పుకుంటూ. ఇటువంటి పరిమిషన్ లేకుండా 50 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వేస్తున్నారు.పచ్చటి పంటలతో రైతన్న ఆనందోత్సవాల నడుమ జీవనం కొనసాగిస్తుంటే , ఆక్వా రంగం కోరలు చాచి, పసిడి రైతులు అయోమయానికి గురచేస్తున్నారు. . వివరాల్లోకెళ్తే రావులపాలెం మండల పరిధి లోని ఈతకోట ముమ్మిడివరప్పాడుగ్రామాలనడుమ గృహ సముదాయాలకు చేరువలో , ప్రధాన రహదారి చెంతనే సుమారు 50 ఎకరాలు పంట భూమిని చెరువులుగా మలచి , పంట రైతులకు తీవ్ర నష్టాన్ని చూపిస్తున్నారు . గృహ సముదాయానికి దగ్గరలో ఆక్వా చెరువులు తవ్వకూడదనే నిబంధనలు ఉన్నా , నిబంధనలను ఉల్లంఘించి, సుమారు 20 జెసిబి యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన చెరువుల నిర్మాణం చేపట్టారు . చుట్టుపక్కల పంట రైతులు తీవ్ర ఆందోళనలకు గురై పంటలు పండించుకునే విధానం ఎలానో తెలియక అయోమయానికి గురవుతున్నారు . దీనిపై సంబంధిత అధికారులుకనీస స్పందన లేదు, కనీసం కన్నెత్తైనా చూడకపోవడం గమనార్హం . రెవిన్యూ డిపార్ట్మెంట్, ఫిషర్ మేన్ సొసైటీ వారు కాసులకు కక్కుర్తి పడి, అధికారులు జేబులు నింపుకుంటున్నారు అని చుట్టుపక్కల నివసిస్తిన్నవారు గుస గుసలు ఆడుకుంటున్నారు . ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా , గ్రామాల నడుమ తవ్వుతున్న చెరువులను నిలుపుదల చేయించి రైతులకు , ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాలని, మేధావులు, విద్యా వంతులు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు కోరుతున్నారు ..