WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

జనవరి 8 ఆదివారం నిర్వహించే గ్రూప్-1 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జిల్లాలో 342 కేంద్రాల్లో 7946 మంది అభ్యర్ధులు పరీక్ష వ్రాసేందుకు ఏర్పాట్లు సిద్దం.

– మొదటి పేపరుకు ఉ.9.45 లోపు 2వ పేపరుకు మ. 1.45 లోపు హాజరు కావాలి

– మొబైల్, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడం నిషేదం

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదిన నిర్వహించబోయే గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు కె. మాధవీలత స్పష్టమైన ఆదేశాలు మేరకు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరశింహులు సంబంధిత అధికారులకు సూచించారు.

స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏ పి పి ఎస్ ఎగ్జామ్స్ నిర్వహణ పై సర్వీఎస్ కమీషన్ అధికారులు, లైజనింగ్ అధికారులు, ఛీఫ్ సూపరింటెండెంట్లు, తదితరులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్బంగా డిఆర్వో నరశింహులు మాట్లాడుతూ జిల్లాలో 342 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు 7946 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారన్నారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పేపరు-1 తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పేపరు-2 పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం జరిగే పరీక్షకు ఉ. 9.45లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు మ. 1.45 లోపు అభ్యర్ధులు ఖచ్చితంగా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు. అదే విధంగా పరీక్షా సమయం పూర్తయ్యేవరకు అభ్యర్ధులను బయటికి వెళ్లేందుకు అనుమతించరాదన్నారు. పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు హాల్ టిక్కెట్లతోపాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు వెంట తీసుకురావాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఏలాంటి మొబైల్ గానీ, బ్లూటూత్, స్మార్ట్ వాచ్, క్యాలిక్ లేటర్ ఇతర ఎలక్ట్రానికి వస్తువులు అనుమతించబోరని ఆయన స్పష్టం చేశారు. వీటిని గుర్తించేందుకు పరీక్షా కేంద్రం వెలుపలే స్క్రీనింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశ్నాపత్రాలకు సంబంధించి సీల్ చేసిన కవరును అభ్యర్ధులు ముందే ఓపెన్ చేయాలన్నారు. ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర పరీక్షా సామాగ్రి జిల్లాకు చేరిన నాటి నుంచి పోలీసు బంధోబస్తుతో భధ్రపరచాలని అదే విధంగా పరీక్షల అనంతరం సంబంధిత సమాధాన పత్రాలను పూర్తి బంధోబస్తుతో ట్రెజరీకి చేర్చాలన్నారు. పరీక్షల నిర్వహణకు సంబందించి సర్వీస్ కమీషన్ సూచించిన మార్గదర్శకాలను లైజన్ అధికారులు, ఛీఫ్ సూపరింటెండెంట్లు ఒకటికి రెండు సార్లు పూర్తి పరిశీలన చేయాలన్నారు.

ఎంతో ప్రాధాన్యత ఉన్న పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపింగ్ కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉందని సర్వీసు కమీషన్ అసిస్టెంట్ సెక్రటరీ కె.శారద పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు నియమించిన లైజనింగ్ అధికారులు పరీక్షా సమయం అంతా ఆయా పరీక్షలు వ్రాసే గదులను పర్యవేక్షించాలన్నారు. సంబంధిత పరీక్షా కేంద్రాలను ముందుగానే సంబంధిత లైజన్ అధికారులు పరిశీలించి అక్కడ ఏర్పాట్లను చూడటంతో పాటు ఛీఫ్ సూపరింటెండెంట్లు ఇన్విజిలేటర్లు తో ముందుగా సమావేశం నిర్వహించుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్బిణీలు, అంధులు, విభిన్న ప్రతిభావంతుల అభ్యర్ధులకు ఆయా పరీక్షా కేంద్రంలోని భవనం కింది అంతస్ధులోనే పరీక్షలు వ్రాసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బిహెచ్, ఓహెచ్ అభ్యర్ధులకు స్క్రైబ్ నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత స్క్రైబ్ ఇంటర్మీడియేట్ లోపు అభ్యర్ధి అయి ఉండాలన్నారు. అభ్యర్ధులు బ్లూ, లేదా బ్లాక్ పాయింట్ బాల్ పెన్ ను తెచ్చుకోవాలన్నారు. ప్రశ్నాపత్రం బుక్ లెట్ పై నిర్ధేశించిన ప్రాంతంలో తమ రిజిష్టరు నెంబరు నమోదు చేయాలన్నారు. ఓఎంఆర్ షీట్ కు సంబంధించి పైన ఉన్న ఓఎంఆర్ ను పరీక్ష అనంతరం అభ్యర్ధినుండి ఇన్విజిలేటర్ సేకరించాలని కింది బాగంలోని ఓఎంఆర్ షీట్ ప్రశ్నాపత్రాన్ని తీసుకువెళ్లవచ్చన్నారు. ఇన్విజిలేటర్లు, లైజన్ ఆఫీసర్లు సర్వీస్ కమీషన్ నిర్ధేశించిన ప్రకారం సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయాలన్నారు.

పరీక్షా కేంద్రం సమీపంలో జీరాక్స్, ఆన్ లైన్ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు ఎస్పీ జి.వి.రావు అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

సమావేశం లో సర్వీస్ కమిషన్ అధికారులు కె.శారద,డి. మల్లికార్జున రెడ్డి, అడిషనల్ ఎస్పీ జీ.వి. రావు, డి.ఎస్.పి స్పెషల్ బ్రాంచ్ డి రామ వర్మ, ఎంహెచ్ఓ డా. ఏ. వినూత్న, అసిస్టెంట్ మేనేజర్ ఆర్టిసి డిపో ఎం అజయ్ బాబు, రాజమహేంద్రవరం రూరల్ తాహాసిల్దార్ ఎన్.ఎస్. పవన్ కుమార్, అడిషనల్ డీఎంహెచ్వో డా. ఎన్ వసుంధర, డిఆర్డిఏ పిడి ఎస్.సుభాషిని, డి ఎల్ డి వో లు వీణా దేవి, శాంతామణి, డిహెచ్ఓ బి. తారాచంద్, డి.ఎస్.ఓప్రసాద్ రావు, జిల్లా అగ్రికల్చర్ అధికారి ఎస్.మాధవరావు, హర్టి కల్చర్ అధికారి వి. రాధాకృష్ణ, బీసీ వెల్ఫేర్ అధికారి పివి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement