దగ్ధమైన ఇల్లు.
బాధితులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్.
విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
గురువారం తెల్లవారుజామున రావులపాలెం గ్రామం కొత్తకాలనీలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి ఒక పూరిళ్లు పూర్తిగా దగ్ధం అవ్వడంతో ప్రక్కనే ఉన్న మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం తెలుసుకొన్న జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ కాలనీలో ప్రమాదానికి గురైయిన మానుపాటి నాగు, బండారి పుల్లమ్మ, గాడ సత్తెమ్మ, కోసూరి దుర్గమ్మ ఇళ్ళును పరిశీలించి జనసేన పార్టీ తరుపున నలుగురు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోట స్వామి, అంబటి కిషోర్, గాయత్రి ప్రసాద్, నంబు నాగు, గీదా వెంకటేష్, అంబటి మణికంఠ, అరవ ప్రసాద్, గంధం వెంకటేష్, కొత్తకాలనీలో రావూరి వీరబాబు, కొప్పిశెట్టి ఆదిత్య, పెరవలి సురేష్, కానూరి నాగు, నాగరాజు, రంకిరెడ్డి ప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు..