విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*రహదారి – రాచబాట*
*(భావితరానికి బంగారు పూత)*
అమలాపురం జనవరి 7 విశ్వం వాయిస్ న్యూస్
ఈనాటి బాలలు రేపటి భావి భారతానికి పునాదులు. ఫిష్
పునాది గట్టిగా ఉంటే ఎంత ఎత్తైన భవనం అయినా చిరస్మరణీయంగా మిగిలి ఉంటుంది. ఈ ఒక్క విషయం గురించి అవగాహన ఉంటే చాలు ప్రతి తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపిస్తారు.
పట్టుకుంటే దొరకనిది ఒక్క కాలం ఒక్కటే… ముందుకు ముందుకు ఉరుకుతూ సాగిపోతూ ఉంటుంది… ఎవ్వరికోసమూ ఆగదు. ఆ కాలానికి ఏ రకమైన భేదభావాలు లేవు. కానీ పసివాళ్లలోని ప్రతిభను గుర్తించి వారికి సరయిన దారిలో నడిపిస్తూ తెలియని విషయాలను తెలియజేస్తూ ఉండటం పెద్దలుగా తల్లితండ్రుల బాధ్యత.
ముఖ్యంగా సాంకేతికత అభివృద్ది చెందిన ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరి చేతుల్లోనూ చరవాణి (మొబైల్ ఫోన్) ఉంటుంది. కరోనా రక్కసి విలయతాండవం చేసిన తరుణంలో ఆ ఫోన్ అవసరమై, విద్యార్థులకు తరగతులను ఇంటి నుంచే నిర్వహించడం జరిగింది.
ఇక సందేహ నివృత్తి చేసుకోవాలంటే ఏ విషయంలోనైనా గూగుల్ లో కానీ, మరి ఏ ఇతర ఆప్ లలోనైనా సమాచారం ఇట్టే మన ముందుకు వచ్చేస్తుంది. ఇక యూట్యూబ్ లో అయితే వీడియో పరంగా కూడా ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్టు చూడగలుగుతున్నాము. దీని వలన మంచి జరుగుతుంది నిజమే… కానీ వెన్ను తట్టి ప్రోత్సహించే ‘గురువు’ ఆత్మీయంగా పలకరించి, విద్యార్థిని పరీక్షలకు సన్నిద్ధం చేసే ‘గురువు’ కనిపించకుండా పోతున్నాడు. గురుశిష్యుల మధ్య ఉన్న అనుబంధం కరువైపోయింది. ఎక్కడో మాస్టారు… మరెక్కడో స్టూడెంట్… క్లాసు అయిపోగానే ఎవరికి ఎవరో… ఇక ఆ విద్యార్థికి చదువు పట్ల గౌరవం ఎక్కడ ఉంటుంది? మెదడులోకి ఎక్కించేసి… పరీక్ష పేపరులో దింపేస్తే చాలు… ఇలా ఉంది నేటి పరిస్థితి.
ఒక చిన్న ఉదాహరణ… శరీరానికి కావలసిన ఉప్పు కంటే ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది… అనేక రుగ్మతలు వచ్చి చేరతాయి దేహంలో. అలాగే చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని అదేపనిగా చూస్తూ ఉంటే జరిగే పరిణామాలు ఎన్నో… ముఖ్యంగా విద్యార్థులలో పుస్తకం తీసుకుని చదవాలని అనిపించదు. జవాబులు కూడా ఆన్లైన్ లో దొరికేస్తుంటే ఇక ఇంత కష్టపడి చదవడం ఎందుకు? అన్న ఆలోచన చిన్న మనసులోకి చేరి చదవటం, వ్రాయటం బద్ధకిస్తారు. అదే మాష్టారు చెపితే అలా ఉంటుందా? తల్లితండ్రులుగా ముందు గమనించవలసినది ఈ విషయం గురించి.
మరొక విషయం ఏమిటంటే పెద్దవాళ్ళకైనా… పిల్లలకైనా సమయపాలన చాలా ముఖ్యమైనది. ప్రస్తుతపు రోజుల్లో సమయానికి విలువ లేకుండా పోతున్నది. అందువల్ల క్రమశిక్షణ లోపిస్తున్నది. నేటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తల్లితండ్రులు ఇద్దరూ పనిచేస్తేనే కానీ, ఖర్చులు భరించలేకుండా ఉన్నాము. అందువల్ల పిల్లలను పట్టించుకోవడానికి ఇంట్లో ఎవరూ ఉండటం లేదు… దానికి కూడా కారణం ఈ రోజుల్లో అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ (చిన్న కుటుంబాలు) అవటం.
అటువంటప్పుడు ఏది మంచి, ఏది చెయ్యాలి, చదువులలో, కెరియర్ లో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? మొదటి తరగతి నుండి చదువు పూర్తి ఆయెవరకూ ఏ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి? లెక్కలు చేయటంలో మెళకువలు, అవసరం అయితే వాళ్ళకు సరైన సూచనలతోపాటు, సమయం తీసుకుని స్వయంగా కూడా వచ్చి చెప్పటం… ఇవన్నీ చూసుకోవటానికి ‘ఒక గురువుగా’ మన కోసమే ఒకరున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చి,
సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదివి, ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ, మరో వైపు ఆర్గానిక్ ఫార్మ్స్ ని నిర్వహిస్తూ, ప్రజలకు ఆరోగ్యవంతమైన పంటను అందిస్తున్న జగదీష్ గారు, తన ఇంట్లో తన పాపకు చెప్పే సూచనలను, టిప్స్ ను అందరికీ పంచాలనే సదుద్దేశ్యంతో, స్వచ్ఛందంగా ఎందరో విద్యార్థులను తయారు చేసారు. నేడు వాళ్ళలో చాలామంది మంచి ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు. ఇప్పుడు కూడా జగదీష్ గారు తన సమయాన్ని పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందు తరంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది పథంలో ముందు ఉండాలనే అభిలాషతో ఈ యజ్ఞం చేపట్టారు.
‘రైతే రాజన్న ఆంధ్రా!’ ఆ రైతే రాజ్యం ఏలుతాడు అన్న నిజం చూపించాలి.
కాబట్టి విద్యార్థులారా… విద్యార్థుల తల్లితండ్రులారా…
ఆలోచించండి… మేలుకోండి… భావి తరానికి బంగారుపూత పూయండి…
మాష్టారు జగదీష్ కాండ్రేగుల గారిని సంప్రదించండి. *9247942363*
ఆరో తరగతి నుండి… ఇంటర్ (ప్లస్ 2 ) వరకూ (కెరియర్ గైడెన్స్) మీకు ఎటువంటి ఫీజు లేకుండా తన సేవలను అందిస్తారు. . మీ పిల్లల భవిష్యత్తు వారికి అప్పగించండి. నిరంతరము మీ బిడ్డల గురించి తెలుసుకుంటూ… వారికి కావలసిన సలహాలు, సూచనలు ఇస్తారు. అవసరం అయితే స్వయంగా వచ్చి మండలం కేంద్రంగా అయినా లేక వారి దగ్గరకు పిల్లలను పిలిపించుకుని అయినా సందేహ నివృత్తి చేయగలరు.
ఇక ముందు రానున్న సంవత్సరాలలో కనీసం ఒక లక్ష మంది విద్యార్థులను ఉన్నత స్థానాలలో నిలబెట్టాలనే ఆయన దృఢసంకల్పంతో ఉన్నారు.
‘చేయి చేయి కలిపితేనే సమిష్టి శక్తి.
ఆ శక్తి విద్యతో కలిస్తే ఒక వినూత్న దివ్య జ్యోతి.’
ఇందులో ఎటువంటి సందేహము లేదు… త్వరపడండి…
అభ్యుదయం వైపు అడుగులు వేయండి…
జగదీష్ కాండ్రేగుల,
9247942363
యలమంచిలి,
అనకాపల్లి.