విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
కూల్చిన బస్ షెల్టర్ మరియు ప్రజా మూత్రశాలను వెంటనే నిర్మించండి.అల్లూరిసీతారామరాజు జిల్లా మోతుగూడెంమేజర్ గ్రామ పంచాయతీ, మోతుగూడెం గ్రామంలో గతంలో బస్ షెల్టర్, దాని వెనుక మూత్రశాల ఉండేవి .అయితే నిర్వహణా లోపం వల్ల ప్రజా మూత్రశాలలు నిరుపయోగంగా ఉండేవి. కొన్నేళ్ల క్రితం హెల్పింగ్ హాండ్స్ అనే చిన్న స్వచ్చంద సంస్థ (మోతుగూడెం యువత ) ద్వారా ఈ మూత్రశాలకు తాత్కాలిక మరమ్మత్తులు చేయించారు. అయినా నిర్వహణ లోపం వలన కొద్ది రోజులకే మరుగున పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం కొద్దిగా నిధులు వెచ్చించి మూత్రశాలలు మరమ్మత్తులు చేయించి ఉంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులకు, మార్కెట్ సెంటర్ లోని వ్యాపారస్థులకు, ఆదివారం వారాంతపు సంతకు వచ్చే చుట్టుప్రక్కల సుమారు 10 గ్రామాల పజలకు,ఉపయోగంగా ఉండేది.కానీ మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీ శాఖ వారు అత్యుత్సాహంతో దృడంగా ఉండే బస్ షెల్టర్ తో పాటు ప్రజా మూత్రశాలను కూడా డబ్బులు వెచ్చించి మరీ కూల్చి వేసారు.దీనిని కూల్చి మూడు నెలలు కావస్తున్నా కనీసం వీటి నిర్మాణం చేపట్టక పోవడం సామాన్యులను సైతం ఆశ్చర్యానికి గురించేస్తుంది .అటు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చిత్రకొండ, జైపూర్ నగరాలకు, మరోవైపు విశాఖపట్నం నుండి భద్రాచలానికి,ఇటు రాజమండ్రి నుంచి సీలేరు వెళ్లే ప్రధాన రహదారి కావడం వలన చాలా మంది ప్రయాణీకులు ఈ రహదారిలో నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అత్యుత్సాహంతో అధికార యంత్రాంగం చేసిన ఈ పని వల్ల ప్రయాణీకులు అందులో ముఖ్యంగా మహిళా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కూల్చిన ఖాలీ ప్రదేశంలో పందులు, కుక్కలు తిరిగి దుర్గంధం వ్యాపించి, ఈగలు, దోమలు ఎక్కువయ్యాయని, వీటి వ్యాప్తి వ్యాప్తి వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడాల్సివస్తుంది అని వ్యాపారస్థులు , గ్రామ ప్రజలు,ప్రయాణీకులు చెబుతున్నారు.ఈ అవస్థలు గమనించిన శీరగం కామేశ్వరరావు అనే వ్యక్తి తాత్కాలికంగా మహిళలకు మరుగుదొడ్లు, మూత్రశాలను గ్రీన్ మేట్ తో నిర్మించారు.ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి మహిళలు, చిన్న పిల్లలు,యువత,వయోవృద్దులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చేయాలని మోతుగూడెం ప్రజానీకం కోరుకుంటున్నారు…