విశ్వంవాయిస్ న్యూస్, పి గన్నవరం:
అధికారులు విధి నిర్వహణలో అందించిన సేవలతోనే గుర్తింపు
పి గన్నవరం విశ్వం వాయిస్ న్యూస్:
ప్రతి ప్రభుత్వ అధికారికి విధి నిర్వహణలో ప్రజలకు అందించిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని పి. గన్నవరం మండల పరిషత్ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సోమవారం పి. గన్నవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద సమావేశంలో విధి నిర్వహణలో విశేష సేవలు అందించి గత నెల 26 తారీఖున 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న అధికారులను ఎంపీపీ అంబటి భూలక్ష్మి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ప్రశంస పత్రాలు అందుకున్న మండల తహసిల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంపీడీవో తాడి,శ్రీ, వెంకటాచార్య, ఎస్సై పి, గంగాభవాని, డిప్యూటీ తహసిల్దార్ బి.గోపాలకృష్ణ, ఎనర్జీఎస్ ఏపీవో చంద్రమోహన్, సచివాలయ సిబ్బందిని ఎంపిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కోన హేలీనా, ఎంపీటీసీలు ఆదిమూలం సూర్యనారాయణ, అవనిగడ్డ సత్తిబాబు, పప్పుల సాయిబాబు, కొక్కిరి లక్ష్మి, పల్లి మోసే, సర్పంచ్ లు బొండాడ నాగమణి, పసలపూడి రామకృష్ణ, కొంబత్తుల ఏసుబాబు, బీర వెంగమంబ, నాయకులు కుంపట్ల నాయుడు, యర్రంశెట్టి తాతకాపు, కుసుమ చిన్న, అంబటి సత్య మణికంఠ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.