విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
పొల్లూరు, తడికవాగు గ్రామాల మధ్య, రహదారిపై పెను ప్రమాదం పొంచి ఉంది. పెద్ద గుంతలు ఏర్పడ్డాయి..వాహనదారులు ఆదమరిచి వాహనం నడితే ఇక అంతే సంగతి … అధికారులు కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా పెట్టకపోవడం గమనార్హం…
వివరాల్లోకి వెళితే పొల్లూరు, తడికవాగు గ్రామాల మధ్య, టైగ్రిస్ జలపాతానికి 2కిలోమీటర్ల సమీపంలో వై. జంక్షన్ నుంచి మొదలుకొని వరుసగా పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారాయి . ఈ రహదారి భద్రాచలం విశాఖపట్నం ఒరిస్సాకు వెళ్లే ప్రధాన రహదారి. భారీ వాహనాలు కూడా ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళలో ఆదమరిచి వాహనం నడిపారో ఇంక అంతే సంగతి . ఇకనైనా సంభందిత అధికారులు మేల్కొని ప్రమాదాలు జరగకుండా ప్రమాద సూచికలను ఏర్పాటు చేసి, రహదారి మరమ్మత్తులు చేయాలని స్థానికులు, వాహన చోదకులు, వారాంతపు (వీకెండ్ )సెలువులకు టైగ్రిస్ జలపాతం సందర్శనకు వచ్చే, పాఠశాల, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చే వారు, గ్రామస్తులు కోరుకుంటున్నారు…