విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్లరేవులో ఆకట్టుకుంటున్న కోలాటం
తాళ్లరేవు, విశ్వం వాయిస్: కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరంగిలో శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధ బాలల ఆశ్రమ ప్రాంగణంలో వెలసిన శ్రీ వనదుర్గ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకల్లో భాగంగా ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనంతో ప్రారంభించి అనంతరం భద్ర హోమం దేవి హోమం చేయించారు. దేవస్థాన కమిటీ సభ్యులు మండల పరిధిలోని చల్లంగి గ్రామానికి చెందిన కోలాటం రప్పించి ఉత్సవం జరిగింది. ఈ వేడుకల్లో ప్రజలకు భక్తులకు కోలాటం యొక్క విశేషం బాగా అర్థమై కోలాటం వద్ద భక్తులు కోలాటాన్ని తొలగించారు. యొక్క కోలాటం చూసి అంతరించిపోతున్న సాంస్కృతిని మళ్లీ గుర్తు వచ్చేలా చేశారని ఆలయ కమిటీ సభ్యులను భక్తులు ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు.