విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి తిరువీధి రథోత్సవం
తాళ్ళరేవు మండలం జార్జిపేట గ్రామంలో వేంచేసి ఉన్న భక్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారి తిరువీధి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక షిరిడి సాయిబాబా వారి ఆలయం నుంచి గ్రామ అడపడుచులు దాన్ని లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ రథోత్సవం కొరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహిళా భక్తులు పసుపు నీళ్ళు మంగళహారతులతో గ్రామంలోకి స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు బాణసంచా కాల్పులు తీన్మార్ డబ్బులు కరగా నృత్యాలు ఏర్పాటు చేశారు గ్రామ పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు అన్న సమారాధనలో పాల్గొని దర్శనం చేసుకుని చుట్టుపక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో తరలి రావడం గొప్ప విశేషం అని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.