విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*వైయస్ ఆర్ లా నేస్తం పథకం*
*జూనియర్ లాయర్లకు స్టేఫండ్గా ప్రతినెలా ఐదు వేలు ఆర్థిక సాయం*
జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర తెలియజేశారు
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ ఫిబ్రవరి 22:
డిసెంబర్ 2019 నుండి వైయస్సార్ లా నేస్తం పథకం కింద, ప్రభుత్వం జూనియర్ లాయర్లకు స్టైఫండ్‌గా ప్రతి నెలా ఆర్థిక సహాయం రూ5వేలు అందిస్తోoదని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి నుండి లా నేస్తం పథకం లబ్ధిని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొని, మాట్లాడుతూ న్యాయవాదులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు .బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ కాబడిన జూనియర్ లాయర్ల దరఖాస్తులను పరిశీలించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతనంగా జిల్లా ఏర్పడిన తరువాత 29 మంది జూనియర్ లాయర్లను ఈ పథకానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లా ఏర్పడక ముందు 38 మంది జూనియర్ లాయర్లు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారని వెరసి జిల్లాలో 67 మంది జూనియర్ లాయర్లు లబ్ధిని పొందడం జరుగు తుందన్నారు వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు నెలవారీ గ్రాంట్ కింద రూ 5 వేలు లభిస్తుందన్నారు. వైయస్సార్ లా నేస్తం పథకం యొక్క ఉద్దేశ్యం చట్టప రమైన నిర్మాణాన్ని మెరుగు పరచడం, న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం. అర్హత ఉన్న న్యాయవాదులందరికీ ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యమ న్నారు. న్యాయవాదులకు సహా యం చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంద న్నారు. దరఖాస్తుదారు న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి వయసు 35 సంవత్సరాలు లోపు ఉండాలన్నారు 2016 సంవత్సరం నుండి ఉత్తీర్ణులైన తాజా న్యాయ పట్టభద్రులు మాత్రమే అర్హులు.
ప్రాక్టీస్ ప్రారంభించి, ప్రాక్టీస్‌లో మొదటి మూడు సంవత్సరాలు పూర్తి చేయని జూనియర్ న్యాయ వాదులు స్టైఫండ్‌కు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ లాయర్లు తదితరులు పాల్గొన్నారు.