విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*దళితులమైన మేమంతా జగన్ వెంటే ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం*
ఎం ఎల్ సి అభ్యర్థి బొమ్మి ఇజ్రాయిల్
అల్లవరం విశ్వం వాయిస్ రిపోర్టర్ శేఖర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాదిగ ఉపకులాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొమ్మి ఇజ్రాయిల్ ను వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడంపై అల్లవరం గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఇజ్రాయిల్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడైన నన్ను శాసనమండలి వరకు తీసుకెళ్లిన ఘనత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్సీ స్థానాల్లో సామాజిక న్యాయం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ అసలైన సామాజిక న్యాయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారని ఇక చంద్రబాబును నమ్మే పరిస్థితిలో దళితులైన మేము లేమని ప్రతి పేదవాడు బాగుపడాలని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక పక్కా ప్రణాళికతో మహోన్నత ఆశయంతో సీఎం ముందుకు తీసుకు వెళ్తున్నారు ఆయన సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు ప్రతి లబ్ధిదారునికి చేరేలా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని సామాన్యుడైన నాకు ఎమ్మెల్సీ వంటి పదవి ఇచ్చేలా కృషిచేసిన రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఎంపీ చింతా అనురాధ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కి నాకు సహకరించిన ప్రతి నాయకునికి, కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు